నకిలీ నోట్ల తయారీ.. ముఠా గుట్టురట్టు
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:01 AM
సంచలనం కలిగించిన రూ.500 ల నకిలీ నోట్ల కేసులో నిందితులు 8 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు.
-పోలీసులఅదుపులో ఏడుగురు నిందితులు..?
-నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం
-అధునాతన టెక్నాలజీతో నోట్ల ముద్రింపు
నాగర్‌కర్నూల్, ఆగస్టు 5 (ఆంధ్ర జ్యోతి):సంచలనం కలిగించిన రూ.500 ల నకిలీ నోట్ల కేసులో నిందితులు 8 మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించా రు. వీరిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాగర్ క ర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అ డ్డాగా జరిగిన ఈ నకిలీ నోట్ల చలామ ణి అంశంలో అనేక ఆసక్తికరమైన కో ణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆధు నాతనమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానా న్ని వినియోగించిన ఈ ముఠా భాగో తం ఒక ప్రముఖ మార్కెటింగ్ సంస్థ కు ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆర్డర్ల ఆధారంగా పోలీసులు నెల రోజులు విచారణ జ రిపి డొంక కదిపారు. నకిలీ నోట్ల త యారీకి సంబంధించి ఎవరికీ అనుమానం రాకుండా వాటర్ ప్రూఫ్ తోపాటు ప్రింటింగ్ తప్పులు దొర్లకుం డా ఉండే అత్యంత నాణ్యమైన పేపర్ ను వినియోగించినట్లు సమాచారం. మొత్తం వెయ్యి పేపర్లు ఉండే ఈ షీట్ విలువ దాదాపు రూ.6వేల పైచిలుకు ఉంది. డెలివరీ చార్జీలు కూడా అదనం. ఒక్కో షీట్‌లో దాదాపు పదుల సంఖ్య లో రూ.500 నోట్లు ముద్ర అవుతాయ ని ప్రాథమికంగా గుర్తించారు. పోలీసు లు బహిరంగపర్చే అంశాలను బట్టి మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. నకిలీ నోట్ల కేసులో బిజినేపల్లి మండలం మంగనూరు గ్రామానికి చెం దిన ఇద్దరితో పాటు మరో ఐదుగురు పోలీసుల అదుపులో ఉన్నారు. దొంగ నోట్లను అక్రమంగా తరలించే ఒక వ్య క్తి పరారీలో ఉండగా మిగతా ఐదుగు రిని కలుపుకుని మొత్తం 7మంది పోలీ సుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కేసుకు సంబంధించిన మరిన్ని అంశాలు ముఠా సభ్యుల పాత నేరచరిత్ర గు రించి నేడు మీడియా ముందు వివరిం చే అవకాశాలు ఉన్నాయి.