కమిషనర్ చాంబర్‌లో కౌన్సిలర్ హల్‌చల్
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:15 PM
వనపర్తి జిల్లా, అమరచింత మునిసిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
- కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం
- అమరచింత మునిసిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- కోఆప్షన్ సభ్యుల ఎన్నికల సందర్భంగా ఘటన
అమరచింత, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా, అమరచింత మునిసిపల్ కార్యాలయం వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం కార్యాలయంలో సమావేశానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల సమయంలో సమావేశాన్ని తక్షణ మే ప్రారంభించాలంటూ 8వ వార్డు బీజేపీ కౌన్సిలర్ ఎం.రాజు కమిషనర్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. ఐదు నిమిషాల్లో మంత్రి వస్తున్నారని కమిషనర్ పదే పదే చెప్పిన ప్పటికీ ఆయన వినిపించుకోలేదు. మంత్రి వచ్చినా, రాకున్నా సమావేశాన్ని ప్రారంభిం చాలంటూ వాగ్వివాదానికి దిగి కమిషనర్ చాంబర్‌లోకి దూసుకెళ్లారు. కుర్చీలో కూర్చొని ఉన్న కమిషనర్‌ను దూషిస్తూ చేయి లాగి దురుసుగా ప్రవర్తించారు. దీం తో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వా గ్వాదం చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతా వరణం నెలకొన్నది. దీంతో డీఎస్పీ వెంక టేశ్వర్లు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు లోకి తెచ్చారు. బీజేపీ కౌన్సిలర్ మేర్వ రాజును పోలీసులు కార్యాలయం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఆ సమయంలో కౌన్సిలర్ పోలీసులతో పోలీసులతో సైతం వాదనకు దిగాడు. ఇలా గందరగోళ పరిస్థితి కొనసాగుతుండగానే మంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంక టేశ్వర్లు, ఎస్‌ఐ శివకుమార్ అక్కడ గుమి గూడిన వారిని చదరగొట్టారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తా..
తనను దుర్భాషలాడి, ఇబ్బంది పెట్టిన కౌన్సిలర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయను న్నట్లు మునిసిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్ తెలిపారు. కోఆప్షన్ ఎన్నిక తర్వాత తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నిక సందర్భంగా 8వ వార్డు కౌన్సిలర్ మేర్వ రాజు తనతో దురుసుగా ప్రవర్తించారని చెప్పారు. కుర్చీలో కూర్చొని ఉన్న తనను ధూషిస్తూ చెయ్యి పట్టి లాగేందుకు యత్నించారని తెలిపారు. ఆయన గత మునిసిపల్ బడ్జెట్, సాధారణ సమావేశంలో కూడా తన విధులకు ఆటంకం కల్పించారని చెప్పారు.