జోరుగా పత్తి సాగు
ABN , Publish Date - Jun 14 , 2026 | 11:48 PM
గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు పత్తి విత్తనాలు విత్తుకోవడంలో బిజీగా కనిపించారు.
అలంపూరుచౌరస్తా, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్నలు బిజీఅయ్యారు. మానవపాడు, ఉండవల్లి, వడ్డేపల్లి, ఇటిక్యాల, అలంపూరు, ఎర్రవల్లి తదితర మండలాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. అప్పటికే సేద్యం చేసి, అచ్చులు వేసుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుకోవడంలో బిజీగా కనిపించారు. గతేడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మిరపసాగు తగ్గవచ్చని చెబుతున్నారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 40వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారని, మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విత్తన ఎంపికలో సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.