వరుణుడు కరుణించక పత్తిపంట తొలగింపు
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:52 PM
ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో సాగుచేసిన పంటలు వాడిపోతున్నాయి.
పది ఎకరాల పత్తిచేను తొలగించిన రైతు
ఉండవల్లి, జూలై 26 (ఆంధ్రజ్యోతి):ఎల్‌నినో ప్రభావంతో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో సాగుచేసిన పంటలు వాడిపోతున్నాయి. ఈ పంటలను చూసిన రైతులు ఏమీ చేయలేక ఆందోళన చెందుతు న్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు రజాక్ 10 ఎకరాలకు కవులుకు తీసుకొని నెల రోజుల క్రితం పత్తి విత్త నాలు నాటించాడు. వర్షం కురవకపోవడంతో విత్తనాలు పలుచగా మొ లకెత్తాయి. మొలకెత్తిన మొక్కలు కూడా వాడుముఖం పట్టాయి. దీంతో విసుగు చెందిన రైతు ఆదివారం ట్రాక్టరు సాయంతో పంట మొత్తాన్ని నాశనం చేశాడు. ఎకరాకు సుమారు రూ.15వేల చొప్పున 10 ఎకరాల కు రూ.1.50లక్షలు నష్టం వాటిల్లిందని రైతు వాపోతున్నాడు.