Share News

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 11:38 PM

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

 ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు
ఉర్దూ మీడియం స్కూల్‌లో నిర్మించనున్న బహుళ అంతస్తుల భవనానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

- ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ అర్బన్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్‌ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నగరం లోని న్యూటౌన్‌లోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో మైనారిటీ సంక్షేమ శాఖ నిధులు రూ. 50లక్షల వ్యయంతో నిర్మించనున్న బహుళ అంతస్తు భవనానికి ప్రభుత్వ విప్‌, ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్ర భుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు మెరుగైన వి ద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కొత్త భవనంలో అవసమైన తరగ తి గదులు ఏర్పాటు చేయ డంతో పాటు కంప్యూటర్‌ లె ర్నింగ్‌ సెంటర్‌, ప్రయోగశా ల, భవిష్యత్తులో అదనపు అంతస్తు గ్రంథాలయం వం టి సౌకర్యాలను కల్పించేం దుకు కృషి చేస్తామని తెలి పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ను పెంచ డం అభినందనీయమని, విద్యతోనే ఉన్నత శిఖ రాలకు ఎదగవచ్చని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యా దవ్‌, ఏఎంవో శ్రీనివా స్‌, ఎంఈఓ లక్ష్మణ్‌సింగ్‌, కాంగ్రెస్‌ నా యకుడు సిరాజ్‌ఖాద్రీ, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ష బ్బీర్‌ అహ్మద్‌, కార్పొ రేటర్లు తహెర్‌, ఉమర్‌కొ త్వాల్‌, విఠల్‌రెడ్డి, నా యకులు అజ్మత్‌అలీ, అవేజ్‌, ఫారుక్‌హుస్సేన్‌, మోయిజ్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2026 | 11:38 PM