మొక్కజొన్న పంట దగ్ధం
ABN , Publish Date - May 03 , 2026 | 11:28 PM
విద్యుత్‌శాఖ అధికా రుల నిర్లక్ష్యంతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై సాగు చేసిన రైతు కు శోకం మిగిలిం ది.
- రైతుకు రూ.2 లక్షల నష్టం
బిజినేపల్లి, మే 3 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌శాఖ అధికా రుల నిర్లక్ష్యంతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమై సాగు చేసిన రైతు కు శోకం మిగిలిం ది. గ్రామస్థులు తె లిపిన వివరాల మే రకు... నాగర్‌కర్నూ ల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని అల్లీపూర్ గ్రామానికి చెందిన డొక్క శ్రీని వాసులు అనే రైతు తనకు ఉన్న 2.10 ఎకరాల భూమిలో మొక్కజొన్న సాగు చేపట్టాడు. పంట కోతకు రావడంతో నూర్పిడి చేసి, పంటసాగుకు చేసిన అ ప్పులు తీర్చాలని ఆశపడిన డొక్క శ్రీనివాసులుకు ఆదివారం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వేగంగా వీస్తున్న గాలులకు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద వదులు గా బిగించిన విద్యుత్ సరఫరా తీగల మధ్య రాపిడితోవచ్చిన నిప్పు రవ్వల మంటలతో మొక్కజొన్న పంట పూర్తిగా దగ్దమైందని బాధిత రైతు కుటుం బం వాపోతుంది. మొత్తం పంట మంటల్లో కాలి బూడిద కావడంతో రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, బాధిత రైతును ప్రభుత్వం పరంగా ఆదుకో వాలని గ్రామ సర్పంచ్ జంగిటి కోటేశ్వర్, మాజీ సర్పంచ్ గొర్ల మల్లికార్జున్, గ్రామస్థులు డిమాండ్ చేశారు. అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యుత్‌శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.