Share News

భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్‌

ABN , Publish Date - Oct 04 , 2026 | 11:37 PM

మల్లమ్మకుంట రిజర్వాయర్‌ ని ర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే తనగల, పరిదాపురం రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు.

భూ నిర్వాసితులకు అండగా కాంగ్రెస్‌
వెంకటరామనగర్‌లో రైతులతో మాట్లాడుతున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌

ఎకరాకు రూ.16.50 లక్షల పరిహారం

ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ కుమార్‌

వడ్డేపల్లి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : మల్లమ్మకుంట రిజర్వాయర్‌ ని ర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే తనగల, పరిదాపురం రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం వెంకటరామనగర్‌ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శివాల యం వద్ద మల్లమ్మకుంట రైతులతో సమావేశమయ్యారు. ఈ సంద ర్భంగా సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ పరిహారం విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ విషయంలో రైతులు ఎ లాంటి అపోహలు పెట్టుకోవద్దని, ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం తగిన విధంగా పరిహారం మంజూరుకు సిద్దంగా ఉందన్నారు. ఇప్పటికే సర్వే నిర్వహించిన అధికారులు నష్టపోతున్న రైతుల వివరాలను కలెక్టర్‌కు నివేదించగా, స్థానిక రైతులకు మాట్లాడి ఎకరాకు రూ.16.50 లక్షల పరిహా రం అందజేయనున్నట్లు తెలిపారు. కాగా, ఈ పరిహారాన్ని మరింత పెం చాలని ఎంపీ మల్లురవితో కలిసి సీఎంను కోరానని, అందుకు సీఎం సానూకూలంగా స్పందించారన్నారు. సమావేశంలో తనగల, పరిదాపు రం గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 11:40 PM