కాంగ్రెస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 11:38 PM
స్వాతంత్య్ర దినత్సోవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆ లపించకుండా వెళ్లిన తీరు బాధ్యతారాహిత్యమే గాక దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు.
బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు
గద్వాలటౌన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినత్సోవ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆ లపించకుండా వెళ్లిన తీరు బాధ్యతారాహిత్యమే గాక దేశ ప్రజలను అవమానించడమేనని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. ఇందుకు బాధ్యతగా ఆ ముగ్గురు నేత వెంటనే దేశప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాం డ్ చేశారు. కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని పాతబస్టాండ్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన బీజేపీ నాయకులు, వందేమాతర గీతం పట్ల కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు యావత్ ప్రజానీకాన్ని గం దరగోళానికి, అనుమానాలకు గురి చేసిందన్నా రు. తమ ప్రవర్తన ద్వారా ప్రజలకు, పార్టీ శ్రేణు లకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకున్నారో వివ రించాలని డిమాండ్ చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బండల వెంకట్రాములు, జిల్లా ప్రధాన కార్యద ర్శులు రవికుమార్ ఎక్బోటే, శ్యాంరావు, పట్టణ అధ్యక్షురాలు జయశ్రీ, కౌన్సిలర్ చంద్రశేఖర్, వి విధ మోర్చాల నాయకులు అనిల్, దేవదాస్, శ్రీమన్నారాయణ, అప్సర్ పాషా, కృష్ణ, మధుగౌ డ్, శంకర్, ఢిల్లీవాలా కృష్ణ, తిమ్మన్న, మోహన్ రెడ్డి, పాండు, పవన్, రమేశ్, కిశోర్ ఉన్నారు.