Share News

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:27 PM

కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి.. రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ నాయకుడు, 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాండురంగారెడ్డి ఆరోపించారు.

రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్‌

- బీజేపీ కార్పొరేటర్‌ పాండురంగారెడ్డి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబంధు పేరు మార్చి.. రైతు భరోసా కింద ఏడాదికి రూ.15వేలు ఇస్తానని ఇవ్వకుండా మోసం చేస్తోందని బీజేపీ నాయకుడు, 25వ డివిజన్‌ కార్పొరేటర్‌ పాండురంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం నాలుగు విడతల రైతు భరోసా ఇవ్వాల్సి ఉండగా, రెండు విడతలు మాత్రమే ఇచ్చిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. వృద్ధాప్య పింఛన్‌ రూ.4 వేలు, కళ్యాణ లక్ష్మి కింద రూ.లక్ష, తులం బంగారం ఇస్తానని మోసం చేసిందన్నారు. ప్రఽధాన మంత్రి అవాస్‌ యోజన కింద ఇస్తున్న ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అర్హులకు ఇవ్వకుండా కాంగ్రెస్‌ కార్యక్తలకు ఇస్తోందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. ప్రధాన మంత్రి సంసద్‌ ఖేల్‌ మహోత్సవంలో భాగంగా క్రీడాకారులు ఈనెల 24లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వచ్చే నెల 9 నుంచి 24 వరకు క్రీడామహోత్సావాలు జరుగుతాయన్నారు. మండల అధ్యక్షుడు బొంగు గంగన్న, జిల్లా మీడియా కన్వీనర్‌ సతీష్‌కుమార్‌, ఎంపీటీసీ మాజీ సభ్యుడు రాజు, మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌, శశికాంత్‌రెడ్డి, శ్రీరాములు, రమేష్‌నాయక్‌, అంజి పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:27 PM