Share News

మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN , Publish Date - Nov 17 , 2026 | 11:38 PM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని టీఎస్‌ సీపీఎ్‌సఈయూ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్‌ విమర్శించారు.

మాట నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం
మాట్లాడుతున్న టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్‌

  • సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ అమలు చేయాలి

  • టీఎస్‌ సీపీఎస్‌ఈయూ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్‌

  • మహబూబ్‌నగర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయుల ధర్మ దీక్ష

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని టీఎస్‌ సీపీఎ్‌సఈయూ జిల్లా అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ విఽధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. టీఎస్‌ సీపీఎ్‌సఈయు ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణమండపం వద్దనున్న ధర్నా చౌక్‌లో మంగళవారం ధర్మదీక్ష చేపట్టారు. దాదాపు రెండువేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులకు సెలవు పెట్టి ధర్మదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి మాట్లాడుతూ సీపీఎ్‌సను రద్దు చేయకపోవడంతో 2.80 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందన్నారు. దీక్షలో జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, రాష్ట్ర బాఽధ్యుడు గడ్డం వెంకటేశ్‌, జిల్లా బాధ్యుడు మల్లేశ్‌, నిఖిల్‌, రాధిక, నర్మద, రాజవర్ధన్‌రెడ్డి, కేశవర్ధన్‌రెడ్డి, ఎంఎంవో దుంకుడు శ్రీనివాస్‌, తపస్‌ జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్‌, బీసీటీఏ అధ్యక్షుడు రాఘవేందర్‌, టీఆర్టీఎఫ్‌ అధ్యక్షుడు రమాకాంత్‌, టీటీయూ అధ్యక్షుడు జుర్రు నారాయణ, యూటీఎఫ్‌ ప్రధా న కార్యదర్శి వెంకటేశ్‌, రూఫ్‌ నాయకుడు శ్రీరాములు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2026 | 11:38 PM