గద్వాలలో ఖరారు కాని కాంగ్రెస్ అభ్యర్థులు
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:13 PM
గద్వాల కాంగ్రెస్‌లో బీ-ఫామ్‌ల అనిశ్చితి కొనసాగుతోంది. రెండు వర్గాలలో ఏ వర్గానికి బీ ఫామ్‌లు వస్తా యో తెలియని పరిస్థితిలో అభ్యర్థులు టెన్షన్‌తో కొట్టుమిట్టాడుతున్నారు.
బీ-ఫామ్‌లు ఎవరికి వస్తాయో తెలియని అనిశ్చితి
17 మందితో బీఆర్‌ఎస్, 24 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా విడుదల
గద్వాల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): గద్వాల కాంగ్రెస్‌లో బీ-ఫామ్‌ల అనిశ్చితి కొనసాగుతోంది. రెండు వర్గాలలో ఏ వర్గానికి బీ ఫామ్‌లు వస్తా యో తెలియని పరిస్థితిలో అభ్యర్థులు టెన్షన్‌తో కొట్టుమిట్టాడుతున్నారు. నామినేషన్లు వేయడాని కి ఒకరోజే గడువు ఉండటంతో ఓ వర్గంలోని అ భ్యర్థులు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్ ఇతర పార్టీల పేరుతో వేరు వేరుగా నామినేష న్లు దాఖలు చేస్తున్నారు. మరో వర్గం కూడ చివ రి రోజు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండిపెండెంట్‌గా అభ్యర్థిగా ఒకేసారి నామినేషన్లు వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇదంతా కాంగ్రెస్ అధి ష్టానం ఇప్పటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరే అని ప్రకటించకపోవడం, లేదంటే ఈ వర్గానికి బీ-ఫామ్‌లు ఇస్తున్నామని తెలియచేకపోవడంతో ఈ అనిశ్చితి కొలకొని ఉంది. అందుకే రెండు వ ర్గాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. గద్వాల మునిసిపాలిటీలో 37 వార్డులు ఉండగా ఒక్కోవార్డు నుంచి కాంగ్రె స్ అభ్యర్థిగా ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. బీ-ఫామ్‌లు ఎవరికి వరిస్తాయో వారే కాంగ్రెస్ అభ్యర్థిగా పో టీలో ఉంటారు మిగిలిన వారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది.