గద్వాలలో కాంగ్రెస్, కమలం పార్టీలు ఒకటే
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:12 PM
గద్వాల మునిసిపాలిటి పరిధిలో కాంగ్రేస్, కమ లం వేరువేరు కాదని, అవి రెండు ఒకటేనని, గుర్తులు వేరైనప్పటికి గుడిసె ఒక్కటే అని బీ ఆర్‌ఎస్ ఇన్‌చార్జి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్ అన్నారు.
స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్
గద్వాలన్యూటౌన్, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): గద్వాల మునిసిపాలిటి పరిధిలో కాంగ్రేస్, కమ లం వేరువేరు కాదని, అవి రెండు ఒకటేనని, గుర్తులు వేరైనప్పటికి గుడిసె ఒక్కటే అని బీ ఆర్‌ఎస్ ఇన్‌చార్జి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం జి ల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ దేశంలో నడుస్తున్న రాజకీయం ఒకటైతే గద్వాల రాజకీయం వేరేగా ఉం దన్నారు. అందుకే బీఆర్‌ఎస్‌ను గెలిపించి మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టాలని ప్రజలు ఆశలో ఉన్నారన్నారు. గద్వాల మునిసిపాలిటీకి సంబంధించి సర్వేలో కూడా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారనే వెల్లడైందని, మామ, అ ల్లుడు బలపరిచిన అభ్యర్థులకు డిపాజిట్ కూ డా దక్కదన్నారు. అనంతరం 17 మంది అభ్య ర్థులతో మొదటి జాబితాను విడుదల చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నియోజకవర్గ అధ్యక్షు డు బాసుహనుమంతునాయుడు, మాజీ ముని సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, నాయకులు కోటేష్, బీచుపల్లి, గంజ్ యూసూప్, పటేల్ జనార్దన్‌రె డ్డి తదితరులు ఉన్నారు.