Share News

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు

ABN , Publish Date - Jan 19 , 2026 | 11:13 PM

మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని, కుమ్మక్కవుతున్నాయని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు.

కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కు
మాట్లాడుతున్న మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీలు కలిసి పని చేస్తున్నాయని, కుమ్మక్కవుతున్నాయని మాజీమంత్రి వి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని చెప్పారు. బీఆర్‌ఎ్‌సలో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్‌ ఇస్తామని, వారి విజయం కోసం పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరారు. సోమవారం ఆయన తన నివాసంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పార్టీకి ద్రోహం చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమన్నారు. రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని గుర్తించుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పూ ర్తి చేయకుండా కాలయాపన చేస్తోందని, ఆంధ్రప్రాంతానికి ప్రయోజ నం చేకూర్చేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో నా యకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, శివరా జు, తాటిగణేస్‌, శ్రీనివా్‌సరెడ్డి, రహమాన్‌, కిశోర్‌, ఆంజనేయులు, అనంతరెడ్డి, ప్రవీణ్‌, నరేందర్‌, రాము, వేదావత్‌, నవకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2026 | 11:13 PM