Share News

అక్రమ ఇంటి నిర్మాణంపై ఆందోళన

ABN , Publish Date - Nov 29 , 2026 | 11:05 PM

మండలంలోని కొండాపూర్‌లో ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది.

అక్రమ ఇంటి నిర్మాణంపై ఆందోళన

గ్రామస్థులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత

గండీడ్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని కొండాపూర్‌లో ఓ వ్యక్తి అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో అది కాస్త ఉద్రిక్తతకు దారి తీసింది. వాస్తవంగా 80 గజాల స్థలం ఉంటే, 180 గజాలు ఉన్నట్లు పంచాయతీ కార్యదర్శి సంతకాలతో పోర్జరీ చేసి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గతంలోనే సర్పంచు కలెక్టర్‌కు, డీపీవోకు ఫిర్యాదు చేయగా, మండల అధికారులకు నిర్మాణం నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోలేదు. నిర్మాణ పనులు చేపట్టడంతో ఆదివారం గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి అధికారుల సూచన మేరకు పనులు చేపట్టాలని సూచించారు. కాగా జీపీ పర్మీషన్‌ లేకుండా నిర్మించడంతో పంచాయతీ కార్యదర్శి నోటీసులు ఇచ్చినా.. కొందరు అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణం చేపట్టారు. దీనికి తోడు పర్మీషన్‌ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు.

Updated Date - Nov 29 , 2026 | 11:05 PM