పకడ్బందీగా ఇంటింటి సర్వే
ABN , Publish Date - Jun 30 , 2026 | 11:09 PM
ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను బీఎల్‌వోలు పకడ్బందీగా నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు.
గద్వాలలోని 21వ వార్డులో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీని పరిశీలించిన కలెక్టర్
గద్వాల, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఇంటింటి సర్వేను బీఎల్‌వోలు పకడ్బందీగా నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. మంగళవారం పట్టణ పరిధిలోని 21వ వార్డు 233, 234 పోలింగ్‌స్టేషన్ల పరిధిలో బూత్‌లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్ వోలు ప్రతీరోజు తమ పరిధిలోని ఇంటింటికీ తిరిగేందుకు ప్రణాళిక రూ పొందించుకుని, నిర్ధేశిత గడువులోగా ప్రక్రియ పూర్తయ్యేలా ముందుకు వెళ్లాలన్నారు. ప్రతీ ఫారాన్ని స్కాన్ చేశాకే ఓటర్లకు ఇవ్వాలని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారాలను పూరించడంలో బూత్ లెవెల్ ఏజెంట్లు, స్థానిక యువత ఓటర్లకు సహకరించాలని సూచించారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇళ్లను సందర్శించి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలను అందజేశారు. కలెక్టర్‌వెంట కౌన్సిలర్ వెంకటేశ్, గద్వాల తహసీల్దార్ హరికృష్ణ, సూపర్‌వైజర్ వెంకటేశ్వర్‌రెడ్డి, బీఎల్ వో శాంతమ్మ, బీఎల్‌ఏలు ఉన్నారు.