Share News

బాలికల సాధికారత ద్వారానే సమగ్ర అభివృద్ధి

ABN , Publish Date - Jan 24 , 2026 | 10:48 PM

బా లికల సాధికాతర ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనిఅదనపు జూనియ ర్‌ సివిల్‌ న్యాయాధికారి ఉదయ్‌నాయక్‌ అన్నా రు.

బాలికల సాధికారత ద్వారానే సమగ్ర అభివృద్ధి

  • అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఉదయ్‌నాయక్‌

గద్వాల క్రైం, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బా లికల సాధికాతర ద్వారానే సమాజ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందనిఅదనపు జూనియ ర్‌ సివిల్‌ న్యాయాధికారి ఉదయ్‌నాయక్‌ అన్నా రు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా న్యాయసేవాధికార సంస్ధ ఆధ్వ ర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలు విద్య, ఉపాధి, నాయక త్వ రంగాల్లో ముందుకురావాలని, వారికి చట్టపరంగా కల్పించిన హక్కులు, రక్షణ చట్టాలపై అ వగాహన కలిగి ఉండాలన్నారు. ఆడపిల్లను బలహీనంగా చూడటం మన ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆడపిల్ల బలహీనురాలు కాదని, ఆమె సహనం, ధైర్యం, ప్రతిభకు ప్రతీక అన్నా రు. ఆడపిల్లలపై వివక్షను తొలగించి వారికి సమాన హక్కులు కల్పించాలన్నారు. బాలికలలపై జరుగుతున్న వివక్షను తొలగించడంలో కుటుంబం, విద్యాసంస్థలు, సమాజం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ హనుమంతమ్మ, ఏ.వో శ్రీధర్‌రెడ్డి, అధ్యాపకులు, విద్యార్ధినులు, పరశురాముడు ఉన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 10:48 PM