కాంప్లెక్స్ సమావేశాలు, పాఠశాలల తనిఖీలు పక్కా ప్రణాళికతో నిర్వహించాలి
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:23 PM
కాంప్లెక్స్ స్థాయి సమావేశాలు, పాఠశా లల తనిఖీలు, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమ లులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప క్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు.
- ఎఫ్‌ఎల్‌ఎన్ అమలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి
- కలెక్టర్ ప్రియాంక
నారాయణపేట, సెప్టెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): కాంప్లెక్స్ స్థాయి సమావేశాలు, పాఠశా లల తనిఖీలు, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాల అమ లులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ప క్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. మంగళవారం సాయం త్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎం ఈవో, హెచ్‌ఎంలు, విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లా డుతూ ఇప్పటివరకు నిర్వహించిన పాఠశాలల సందర్శనలో ఆశించిన స్థాయిలో పురోగతి కని పించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ పాఠశాలను తప్పనిసరిగా సందర్శించి అ క్కడ జరుగుతున్న విద్యా కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. రాబో యే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు సన్నద్ధమయ్యేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎస్‌ఏ-1 పరీక్షలను విద్యార్థులు సమర్థవంతంగా రాసేలా అవసరమైన ముంద స్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలు, మిడ్‌టర్మ్, రివ్యూలు, కాంప్లెక్స్ స మావేశాలు, పాఠశాలల తనిఖీలన్నీ సమన్వ యంతో నిర్వహించేలా డీఈవో కార్యాలయం నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. ఇకపై కాంప్లెక్స్ సమా వేశాలు, పాఠశాలల సందర్శనల్లో నిర్లక్ష్యం లేకుం డా ప్రతీ అధికారి, ప్రతీ బృందం సభ్యుడు తమ కు అప్పగించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో ని ర్వహించాలని ఆమె స్పష్టం చేశారు. అనంతరం స్టూడెంట్స్ ప్రాక్టీస్ వర్క్‌షీట్ బుక్‌లెట్‌లను క లెక్టర్ ఆవిష్కరించారు. ట్రైనీ కలెక్టర్ ఫణికుమా ర్, డీఈవో గోవిందరాజులు, ఏఎంవో విద్యాసాగ ర్, ఎంఈవోలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.