Share News

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:40 PM

ప్రజావాణి ఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అఽ దికారులను ఆదేశించారు.

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులను సత్వ రం పరిష్కరించాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అఽ దికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించి, మాట్లాడారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్ర జావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుం దని, ఆర్టీలకు ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్క రించాలని అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ హరిప్రియ, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ సా యిశివాని, డీఆర్వో నిర్మల, జెడ్పీ సీఈవో వెంకట్‌ రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.

ప్లాటును ప్రోహిబిటెడ్‌ లిస్టు నుంచి తొలగించాలి..

ప్లాటును ప్రోహిబిటెడ్‌ లిస్టులో నుంచి తొల గించాలని కోరుతూ నగరం లోని వివేకానందనగర్‌ కా లనీకి చెందిన రుద్రారం ర వీందర్‌రెడ్డి ప్రజావాణిలో క లెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. మహబూబ్‌నగర్‌ అర్బన్‌ మండలం పాలకొండ గ్రామ శివారులో డీటీసీపీ లే అవుట్‌లో గల భూమి స ర్వే నెంబర్‌ 298, ప్లాట్‌ నెం.37 288.33 గజాలు ఉందని, 2021లో జూన్‌లో రిజిస్టేషన్‌ చేసుకున్నట్లు వినతిలో పేర్కొన్నారు. ఈ ప్లాటును విక్రయించడానికి వెళ్లగా మీ ప్లాటు ప్రభుత్వ ప్రోహిబిడెట్‌ లిస్టులో ఉందని తెలిపారని, వెంటనే ప్రోహిబిటెడ్‌ లిస్టులో నుంచి తొలంగించాలని కోరారు.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలి..

క్రిష్టయన్‌పల్లి శివారు 523 సర్వేలో పేదలకు పట్టాలు ఇచ్చారని, 2018లో పట్టాలు సర్టిఫికెట్లు తీసుకున్న వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు అం దించాలని నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో ప్ర జావాణిలో ఫిర్యాదు చేశారు. రామ్మోహన్‌, భాగ్య లక్ష్మి, పార్వతమ్మ, మంజులబాయి, అరవింద మ్మ, వాజిదబేగం ఉన్నారు.

భూ సేకరణ వేగవంతం చేయాలి

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల భూ సేక రణ, ఆర్‌అండ్‌ఆర్‌ పనులు వేగవంతం చే యాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌ నుంచి నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెం డింగ్‌ భూ సేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం - పునరావాస పునరుద్దరణ (ఆర్‌ అండ్‌ఆర్‌) పనుల పురోగతిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సం జయ్‌ జాజుతో కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. వీసీలో కలెక్టర్‌ ఖుష్బూగుప్తా పాల్గొనగా, మంత్రి మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టుల అవసర మైన నిధులు విడుదలకు చేసేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాయిశివాని, భూ సేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామిరెడ్డి పాల్గొన్నారు.

మెడికల్‌ ఇన్వాలిడేషన్‌ కేసుల పరిశీలన

కలెక్టరేట్‌ కార్యాలయంలోని సోమవారం మె డికల్‌ ఇన్వాలిడేషన్‌ కేసులను కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా పరిశీలించారు. జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు దీర్ఘకాలిక అనారోగ్యం, ఇతర వైద్య కారణాలతో ఉద్యోగ బాధ్యతలు నిర్వరించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలుసుకున్న కలెక్టర్‌ వారిని నేరుగా కలెక్టరేట్‌ వీసీ హాల్లఓ కలుసుకొని వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసులన్నింటినీ పరిశీలించి, అ భ్యర్థి అర్హుడా కాదా నిర్ధారించిన తర్వాతే నిర్ణ యం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎం హెచ్‌వో శ్రీనివాసులు, జిల్లా సంక్షేమ శాఖ అధి కారి జరీనాబేగం పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 11:40 PM