ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:32 PM
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని క లెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూలై 13 (ఆంధ్రజ్యోతి) : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని క లెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా వాణిలో ఫిర్యాదులు స్వీకరించి, మాట్లాడారు. ఆర్జీలకు ప్రాధాన్యతని స్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. అదనపు కలెక్టర్ మ దుసూదన్‌నాయక్, అసిస్టెంట్ కలెక్టర్ సాయిశివాని, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ రాంరెడ్డి, డీఆర్వో నిర్మల, జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి, డీఆర్డీవో నర్సింహులు పాల్గొన్నారు.
ఇళ్ల మధ్య డ్రైనేజీ వద్దు..
నగరంలోని సంజయ్‌నగర్ కాలనీలోని వాల్మీ కి ఆలయం సమీపంలోని ఇళ్లలోంచి డ్రైనేజీ నిర్మించొద్దని, ఇళ్ల ముందు 80 ఫీట్ల రోడ్డు ఉండగా ఇళ్ల మధ్యలోంచి తీసుకోపోడం సరికాదని వినతిలో పేర్కొన్నారు.
క్రషర్ మిషన్ ఎత్తివేయాలి..
మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్ గ్రామ శివారులో అనుమతి లేకుండా నడిపిస్తున్న కంకర మిషన్‌ను తొలగించాలని కోరుతూ ఉప సర్పంచ్ బోల యాదయ్య, 10, 2వ వార్డు మెంబర్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దుమ్ము, ధూళితో పంటలు దెబ్బతుంటాయని వినతిలో పేర్కొన్నారు.