Share News

చైర్మన్‌ పదవి కోసం పోటీ

ABN , Publish Date - Feb 15 , 2026 | 11:11 PM

మునిసిపల్‌ చైర్మన్‌ సీటు కోసం మహిళలు పోటీ పడుతున్నారు. గద్వాల మునిసిపాలిటీ జనరల్‌ మ హిళకు కేటాయించారు. దీంతో అన్నివర్గాల మ హిళలకు చైర్మన్‌ పొందే అవకాశం ఉంది.

చైర్మన్‌ పదవి కోసం పోటీ

గద్వాల, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ చైర్మన్‌ సీటు కోసం మహిళలు పోటీ పడుతున్నారు. గద్వాల మునిసిపాలిటీ జనరల్‌ మ హిళకు కేటాయించారు. దీంతో అన్నివర్గాల మ హిళలకు చైర్మన్‌ పొందే అవకాశం ఉంది. ఏ వర్గానికి సీటు దక్కుతుందో అనే చర్చ సాగుతున్నది. కాంగ్రెస్‌ నుంచి జనరల్‌, బీసీ, ఎస్సీ మ హిళలు ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో క్యాంపులు నిర్వహిస్తున్నారు. సోమవారం జరిగే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సమయానికి క్యాంపులో ఉన్న కౌ న్సిలర్లను గద్వాలకు తరలించేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ వాహనాలను సిద్ధం చేశారు. తరలించే సమయంలోనే ఎవరు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌గా ఉంటారో కౌన్సిలర్లకు చెప్సే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో ముగ్గురు మహిళలు త మకు కేటాయించాలని కోరినట్లు తెలుస్తుంది. సీడ్‌ ఆర్గనైజర్లు 16వ వార్డు నుంచి గెలుపొందిన వేదవతికి అవకాశం కల్పించాలని కోరినట్లు తెలుస్తుంది. 33వ వార్డు నుంచి గెలుపొందిన తుమ్మల జయలక్ష్మికి అవకాశం కల్పించాలనే చర్చ కూడా నడిచినట్లు తెలుస్తుంది. ఆమె కుటుంబంలో భర్త నర్సింహులు, అత్తమామలు తుమ్మల వెంకటమ్మ, తుమ్మల నర్సింహులు కౌ న్సిలర్‌గా సేవలు అందించారు. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాలలో ఉన్నారనే చర్చ నడిచినట్లు తెలుస్తున్నది. సామాజిక వర్గంగా ఆలోచిస్తే ఎస్సీలకు ఇప్పటి వరకు చైర్మన్‌ పదవి దక్కలేదని ఆలో చిస్తే 4వ వార్డు నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొందిన లలితమ్మకు అవకాశం కల్పించవచ్చనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉండగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగి అవకాశం వస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 23వ వార్డు కబీర్దాస్‌ అనిత, 37వ వార్డు కౌన్సిలర్‌ మంజులవాణి, బీజేపీ నుంచి 17వ వార్డు కౌన్సిలర్‌ మానస త్యాగరాజు ఉన్న ట్లు తెలుస్తుంది. బలాబలాలు పరిశీలిస్తే కాంగ్రెస్‌ పార్టీకే అవకాశం ఎక్కవగా ఉంది వా రిలో ఎవరైన చైర్మన్‌ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉంది.

Updated Date - Feb 15 , 2026 | 11:11 PM