Share News

మల్లమ్మకుంట బాధితులకు పరిహారం పెంపు

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:34 PM

మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతుల సహకారం అభినందనీయమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు.

మల్లమ్మకుంట బాధితులకు పరిహారం పెంపు

- కొడంగల్‌ తరహాలో ఎకరాకు రూ.20లక్షలు..!

- కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌

గద్వాల, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణానికి వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతుల సహకారం అభినందనీయమని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషాషేక్‌ అన్నారు. రిజర్వాయర్‌ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు కొడంగల్‌ తరహాలో ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని కలెక్టర్‌ తెలిపారు. ఈ సందర్భంగా సో మవారం మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌తో కలిసి ఆయ న కలెక్టరేట్‌లో తనగల రైతులతో సమావేశమయ్యారు. మూడు నెలలుగా రైతులతో వివిధ దఫాలుగా సమావేశమయ్యామని తెలిపారు. మొదట రూ.12లక్షలు ఆ తర్వాత రూ.16.50లక్షలు ఇచ్చేందుకు అంగీకరించామ ని తెలిపారు. ఇప్పుడు కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో ఇస్తున్న పరిహారమే రైతులకు చెల్లి స్తుండటం సంతోషంగా ఉందన్నారు. రైతులకు పరిహారంతో పాటు ఇందిరమ్మ ఇల్లు, రిజర్వాయర్‌లో చేపల వేట హక్కులు కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు. రైతు లందరికి జిల్లా యంత్రాంగం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఆర్డీఎస్‌ రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మల్లమ్మకుంట రిజర్వాయర్‌ నిర్మాణం ఎంతో ప్రతిష్ఠాత్మకమైనదని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి తనగల రైతులకు న్యాయం చేస్తూ పరిహారం పెంచడం జరిగిందని వివరించారు. అనంతరం తనగల గ్రామ రైతులు కలెక్టర్‌ను, సంపత్‌కుమార్‌లను సత్కరించారు. ఈ సమావేశంలో అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దొడ్డప్ప, భూసేకరణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కృష్ణ, సర్వే ఏడీ నూకరాజు, తనగల గ్రామ సర్పంచు వెంకటేష్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 05 , 2026 | 11:34 PM