ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పరిహారం
ABN , Publish Date - Sep 24 , 2026 | 11:11 PM
ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు రైతులకు పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
గద్వాల ఆర్డీవో శ్రీనివాసరావు
వడ్డేపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్ణయించిన ధర మేరకు రైతులకు పరిహారం చెల్లిస్తామని ఆర్డీవో శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల కేంద్రంలోని మండల మహిళా సమాఖ్య భవనంలో గురువారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, తహసీల్దార్ శివకుమార్‌తో కలిసి ఆర్డీవో మల్లమ్మకుంట రైతులతో సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ మ ల్లకుంట రిజర్వాయర్ నిర్మాణానికి ఇప్పటికే సర్వే పూర్తి అయిందని, ఇందులో భాగంగానే రైతుల కు చెందిన భూముల సర్వే పనులు కూడా పూ ర్తి చేశామన్నారు. ప్రభుత్వం సూచించిన విధం గా ఏఒక్క రైతు కూడా నష్టపోకుండా పరిహారం అందుతుందన్నారు. అనంతరం రైతులు పరిహా రం విషయంలో అధికారులు ముందుగా ప్రక టించిన విధంగా కాకుండా సర్వే ముగిశాక మ రొక మాట చెప్పడంపై అసహనం వ్యక్తం చేశా రు. రిజర్వాయర్ నిర్మాణంలో గ్రామంలో దాదా పు 577 ఎకరాల వ్యవసాయ భూమిని కోల్పోతు న్నామని రైతులు తెలిపారు. తాము ఆశించిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్ణయించిన పరిహారం ఇస్తే తాము తీవ్రంగా నష్టపోతామని అధికారులకు విరవించారు. ఎకరాకు రూ.7.50 లక్షలు ఇస్తామని చెబుతున్న ప్రభుత్వం నిర్ణ యంతో తాము ఏకీభవించబోమని, కోర్టు ద్వా రా వెళ్లినా తమకు రూ.14 లక్షల వరకు మాత్ర మే పరిహారం దక్కే అవకాశం ఉందన్నారు. ఈ డబ్బుతో కనీసం తాము ఎకరా భూమి కూడా కొనుగోలు చేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తనగల, పర్ధిపురం గ్రామాల్లో ఎకరా రూ.30లక్షల ధర ఉందని, తాము చివరి దాకా పోరాడితే ఎకరాలకు రూ.14 లక్షల వరకు మాత్రమే వస్తుందన్నారు. ప్రభుత్వ జీవోలో తన గల రైతులు నిర్వాసితులు కాదని ఉందని, భూ ములు కోల్పోతే తాము సర్వం పోగుట్టుకున్న వారమవుతామని అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఫిషరింగ్, బోటింగ్‌పై కూడా స్పష్టత ఇవ్వలేదని రైతులు అధికారులను అడిగారు. పరిహారం విషయంలో తమ సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకువెళ్లి, తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని రైతులు కోరారు.