Share News

వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ముఖ్యం

ABN , Publish Date - Oct 23 , 2026 | 11:06 PM

వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ ప్రియాంక స్పష్టం చేశారు.

వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ముఖ్యం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రియాంక

- కలెక్టర్‌ ప్రియాంక

- ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ మూడో బ్యాచ్‌ ఓరియంటేషన్‌ డే, వైట్‌ కోట్‌ ౅సెరిమోనీ

నారాయణపేట రూరల్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): వైద్య వృత్తిలో కరుణ, సేవాభావం ఎంతో ముఖ్యమని కలెక్టర్‌ ప్రియాంక స్పష్టం చేశారు. నారాయణపేట మండలం అప్పక్‌పల్లి వద్ద గల ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో శుక్రవారం ఎంబీబీఎస్‌ మూడో బ్యాచ్‌ విద్యార్థుల కోసం ఓరింటేషన్‌ డే, వైట్‌ కోట్‌ సెర్మనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ వైద్య వృత్తిలో కరుణ, మానవత్వం అత్యంత కీలకమని, ప్రతీ రోగికి గౌరవం, ఓర్పుతో ధైర్యం కల్పించి మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డిప్యూటీ సూపరిం టెండెంట్‌ ఆదిత్యగౌడ్‌, ఆర్‌ఎంవో బాలాజీ సింగాడే, అన్ని విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

నారాయణపేట (ఆంధ్రజ్యోతి): నారాయణ పేట జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు వద్ద నిర్మిస్తున్న నూతన సమీకృత జి ల్లా కార్యాలయాల సముదాయం భవన నిర్మాణ పనులను కలెక్టర్‌ ప్రియాంక శుక్రవారం పరిశీ లించారు. ఈ సందర్భంగా భవన సముదాయం లో కొనసాగుతున్న వివిధ పనులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. భవన సముదాయం లోని వివిధ శాఖలకు కేటాయిస్తున్న హాళ్లు, గ దులను పరిశీలించారు. భవన సముదాయానికి నిరంతరం తాగునీటి సరఫరా కల్పించే అంశం పై మిషన్‌ భగీరథ ఈఈతో ఫోన్‌లో మాట్లాడా రు. పనులన్నింటిని వారం, పది రోజుల్లో పూర్తి చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధి కారులను ఆదేశించారు. పరిశీలనలో ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణయ్య, డీఈఈ రాములు, త హసీల్దార్‌ అమరేంద్రకృష్ణ, ఏఈలు ఉన్నారు.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి

నారాయణపేట జిల్లాలో వర్షపాతం తగ్గిన నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావం వల్ల తలెత్తే పరి స్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖల అధికా రులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్‌ ప్రియాంక ఆదేశించారు. శుక్రవా రం సాయంత్రం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫ రెన్స్‌ హాల్‌లో ఎల్‌నినో ప్రభావం, తాగునీటి సర ఫరా, వ్యవసాయం, ప్రజారోగ్యం, అభివృద్ధి పను ల పురోగతిపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవంబరు, డిసెంబరు నెలల్లో మండల, గ్రామస్థాయి అధికారులు క్షేత్ర స్థాయి లో పర్యటించి తాగునీటి అవసరాలు, నీటి వన రుల లభ్యతను పరిశీలించాలని సూచించారు. నీటి వనరుల స్థితిగతులు, గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులు, వేసవి కార్యాచరణ ప్రణా ళికపై ఆమె సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో మంజూరైన అభివృద్ధి పనులను వేగ వంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అద నపు కలెక్టర్‌ శ్రీను, ఎస్‌డీసీ రాజేందర్‌ గౌడ్‌, జ డ్పీ సీఈవో శ్రీనివాస్‌రావు, డీఆర్‌డీవో వెంకట్‌రా ములు, డీఏవో సక్రియానాయక్‌, ప్రభుత్వ ఆసు పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమా ర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జయచంద్రమోహన్‌, పీ ఆర్‌ ఈఈ అశోక్‌కుమార్‌, జిల్లా ఆసు పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ మల్లికార్జున్‌, సీపీవో ఖా ఘవాహన్‌, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారిని బాలమణి, ఆర్‌అండ్‌బీ ఈఈ వెంకటరమణ య్య, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రామలింగే శ్వర్‌గౌడ్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ నవీన్‌కుమార్‌, డీఈవో గోవిందరాజులు, హౌసింగ్‌ పీడీ శంకర్‌ నాయక్‌, పశు సంవర్థక శాఖ అధికారిని జగదీశ్వ రి, సివిల్‌ సప్లయ్‌ అధికారి బాల్‌రాజ్‌, డీఎం సై దులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2026 | 11:06 PM