Share News

పట్టణ సమగ్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:09 PM

గద్వాల పట్టణాన్ని పూర్తిస్థాయి సౌకర్యాలతో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చెప్పారు.

పట్టణ సమగ్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి
గద్వాలలో రోడ్డు విస్తరణ పనులకు భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • పలువార్డుల్లో అభివృద్ధి పనులకు భూమిపూజ

గద్వాల టౌన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పట్టణాన్ని పూర్తిస్థాయి సౌకర్యాలతో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి చెప్పారు. వివిధ వార్డుల్లో అభివృద్ధి పనుల కోసం గద్వాల పట్టణానికి ప్రభుత్వం రూ.18.07 కోట్లు మంజూ రు చేసిందన్నారు. వార్డుల్లో చేపట్టే పలుఅభివృద్ధి పనులకు బుధవారం భూమిపూజ చేశారు. గ ద్వాల పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. కా ర్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వేణుగో పాల్‌, మాజీ వైస్‌చైర్మన్‌ ఎండీ బాబర్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు కృష్ణారెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, నా యకులు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, విజయ్‌, రామన్‌ గౌడ, రాజ శేఖర్‌, కురుమన్న ఉన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:09 PM