Share News

సగరుల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి

ABN , Publish Date - Jan 04 , 2026 | 11:30 PM

సగరు(ఉప్పరి)ల అభ్యున్నతికి తన వంతు బా ధ్యతగా సంపూర్ణ తోడ్పానందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు.

సగరుల అభ్యున్నతికి నిబద్ధతతో కృషి
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • గద్వాలలో సగర సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం

గద్వాల టౌన్‌, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సగరు(ఉప్పరి)ల అభ్యున్నతికి తన వంతు బా ధ్యతగా సంపూర్ణ తోడ్పానందిస్తానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. పట్టణంలో సగరుల ఆరాధ్యదైవం శ్రీ భగీరథుని విగ్రహం ఏర్పాటుకు అన్నివిధాలా సహకరిస్తానన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా సగర సంఘం జిల్లా నూతన కార్యవర్గం ఆదివారం పట్టణంలోని ఒక ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో ప్రమాణ స్వీకారం చేశా రు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఉప్పరి కులదైవం శ్రీ భగీరథుని చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే, పట్టణ పరిధిలో సగర సం ఘం భవన నిర్మాణానికి అర ఎకరం స్థలంతో పాటు రూ.20లక్షల నిధులను అందజేస్తామని హామీ ఇచ్చారు. సగరులు కూడా రాజకీయంగా బలోపేతమయ్యే విధంగా స్థానిక సంస్థల ఎన్నిక ల్లోనూ, నామినేటెడ్‌ పదవుల విషయంలోనూ తగిన స్థానం కల్పించామని గుర్తుచేశారు. భవి ష్యత్‌లోనూ ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కాగా, బీసీ-డి జాబితాలో ఉన్న సగరులను బీసీ- ఏలో మార్చే విషయంలో సమస్యను ప్రభుత్వం దృష్టికి తెస్తామన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఉప్పరి తిమ్మప్ప భార్య గో కారమ్మకు సంఘం తరఫున రూ.2లక్షల చెక్కు ను ఎమ్మెల్యే, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చే తుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో సగ ర సంఘం జిల్లా నాయకులతో పాటు మాజీ కౌ న్సిలర్‌ శ్రీను ముదిరాజ్‌, రమేష్‌నాయుడు, అజ య్‌, వంట భాస్కర్‌ ఉన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 11:30 PM