Share News

వైద్య పరీక్షల్లో వెనుకబడటంపై కలెక్టర్‌ ఆగ్రహం

ABN , Publish Date - Mar 31 , 2026 | 11:20 PM

గట్టు అస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో నిర్ధేశించిన 38 ఇండికేటర్స్‌లో వందశాతం లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

వైద్య పరీక్షల్లో వెనుకబడటంపై కలెక్టర్‌ ఆగ్రహం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

  • గట్టు అస్పిరేషనల్‌ బ్లాక్‌లో వంద శాతం లక్ష్యాలు సాధించాలి

  • కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌

గద్వాల న్యూటౌన్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): గట్టు అస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో నిర్ధేశించిన 38 ఇండికేటర్స్‌లో వందశాతం లక్ష్యాలను సాధించడమే ధ్యేయంగా సంబంధిత శాఖల అధికారులు పనిచేయాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. నీతిఅయోగ్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గట్టు ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రాంలో భాగంగా జనవరి 28 నుండి ఏప్రిల్‌ 14 వర కు చేపట్టిన సంపూర్ణత అభియాన్‌ 2.0 కార్యక్రమంలో మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ఆరు నెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో అదనపు పోషక ఆహారం అందించడం, తాగునీటి సౌకర్యం పూర్తిస్థాయిలో కల్పించాలన్నారు. నిర్మాణంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల భవనాలను, ప్ర భుత్వ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను నిర్ధేశిత సమయంలోగా పూ ర్తి చేయాలన్నారు. పశువులకు ఎఫ్‌ఎండీ(ఫుడ్‌ అండ్‌ మౌత్‌ డీసీజెస్‌) టీకా ల లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. వైద్యఆరోగ్యశాఖ తరఫున చేస్తున్న కార్యక్రమాలు, వైద్య పరీక్షల్లో వెనుకబడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాక్‌ ప్రోగ్రాంకు సంబంధించి ప్రతీవారం సంబంధిత అధికారులు మండలస్థాయి లో సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. గట్టు బ్లాక్‌ ర్యాంకింగ్‌ మెరుగుపడటానికి సంబంధిత శాఖల అఽధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ సంధ్యాకిరణ్మయి, జిల్లా సంక్షేమాధికారి సునంద, డీఈవో విజయలక్ష్మి, గట్టు ఎంపీడీవో చెన్నయ్య, అధికారులు ఉన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 11:20 PM