Share News

కలకలం రేపిన కలెక్టరేట్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Feb 11 , 2026 | 11:31 PM

నారాయణపేట పట్టణ పరిధి లోని ఎస్సీవాడలో విషాద సంఘటన చోటుచే సుకుంది.

 కలకలం రేపిన కలెక్టరేట్‌ డ్రైవర్‌ ఆత్మహత్య

నారాయణపేట టౌన్‌ ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట పట్టణ పరిధి లోని ఎస్సీవాడలో విషాద సంఘటన చోటుచే సుకుంది. కలెక్టర్‌ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న సుదర్శన్‌(32) అనుమానాస్పదం గా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడికి భార్యతో పాటు ఒక కు మారుడు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన చోటుచేసు కున్నట్లు సమాచారం. అదే సమయంలో కుటుంబ సభ్యు లు మునిసిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించేందుకు వెళ్లి నట్లు తెలిసింది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 11 , 2026 | 11:31 PM