స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సీఎం కృషి
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:27 PM
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) దుంకుడు శ్రీనివాస్ అన్నారు.
- క్రీడా కోటాతో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు
- ఏఎంవో దుంకుడు శ్రీనివాస్
- ప్రారంభమైన రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ టోర్నీ
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ (ఏఎంవో) దుంకుడు శ్రీనివాస్ అన్నారు. నగరంలోని మహబూబ్‌నగర్ గ్రామర్ స్కూల్ మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్ - 19 ఎస్‌జీఎఫ్ హ్యాండ్‌బాల్ పోటీలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయస్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ జట్టు అద్భుత ప్రతిభను చాటి విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు. క్రీడా కోటాలో ఉన్నత విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. సీఎంవో సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ టోర్నీలో జిల్లా జట్టు ప్రతిభ చాటి విజేతగా నిలువాలని ఆకాంక్షించారు. మహబూబ్‌నగర్ హై స్కూల్‌లో బాలికలకు, హీరామోడల్ స్కూల్‌లో బాలురకు పోటీలు నిర్వహించారు. పోటీలకు ఉమ్మడి 10 జిల్లాల నుంచి 340 మంది క్రీడాకారులు, 60 మంది అఫీషియల్స్, కోచ్ మేనేజర్లు మొత్తం 400 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సెక్రటరీ వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తిగౌడ్, టీజీ పెట జిల్లా అధ్యక్షుడు జగన్‌మోహన్‌గౌడ్, ప్రిన్సిపాల్ శాంత, డీఐఈవో కార్యాలయ సూపరింటెండెంట్ సాధిక్, టోర్నీ పరిశీలకులు రఫత్‌ఉమర్, శ్రీనివాస్, ఆలిండియా యూనివర్సిటీ ఈసీ మెంబర్ బాలరాజ్, టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీయావుద్దీన్, అనిల్‌కుమార్, పీడీలు శంకర్, చందర్, ప్రదీ్‌పకుమార్, అహ్మద్‌హుస్సేన్, నరసింహ, రంజిత్, ఉబెద్‌ఉర్-రహెమాన్, అర్చన పాల్గొన్నారు.
పాలమూరు జట్ల శుభారంభం
ఎస్‌జీఎఫ్ అండర్-19 రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ చాంపియన్‌షి్‌ప టోర్నీలో అతిథ్య మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లా బాల, బాలికల జట్లు శుభారంభం చేశాయి. జిల్లా బాలుర జట్టు 16-06 గోల్స్ తేడాతో నిజామాబాద్ జట్టుపై విజయం సాధించింది. బాలికల జట్టు 20-03 గోల్స్ తేడాతో హైదరాబాద్ జట్టపై గెలిచింది. బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు 12-06 గోల్స్ తేడాతో ఆదిలాబాద్ జట్టుపై విజయం సాధించింది.