సీఎం సభ సక్సె్‌స
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:40 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటన సక్సెస్ అయ్యింది. జిల్లా నలువైపుల నుంచి అ ధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. సీఎం వ చ్చేకన్నా గంట ముందుగానే జిల్లా కేంద్రంలో ని ఎంవీఎస్ కళాశాల మైదానం నిండిపోయింది.
పార్టీ శ్రేణుల్లో జోష్
అధిక సంఖ్యలో తరలివచ్చిన జనం
బలప్రదర్శన చేసిన మునిసిపల్ ఆశావహులు
పర్యటనకు భారీ పోలీస్ బందోబస్తు
మహబూబ్ నగర్, (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటన సక్సెస్ అయ్యింది. జిల్లా నలువైపుల నుంచి అ ధిక సంఖ్యలో జనం తరలి వచ్చారు. సీఎం వ చ్చేకన్నా గంట ముందుగానే జిల్లా కేంద్రంలో ని ఎంవీఎస్ కళాశాల మైదానం నిండిపోయింది. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో పో టీ చేయాలనుకుంటున్న ఆశావహులు తమ వార్డు, డివిజన్‌ల నుంచి మద్దతుదారులతో క లిసి మైదానం వద్దకు చేరుకున్నారు. అన్ని డి విజన్‌ల నుంచి కార్యకర్తలను, ప్రజలను స భకు తరలించారు. మహిళలు అధికంగా వ చ్చారు. చాలామంది ఇందిరమ్మ చీరలతో కనిపించారు. సభా ప్రాంగణం కిక్కిరిసి పోవడంతోపాటు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలను అభినందించారు. మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల ముందు సీఎం సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. సభకు పోలీసు లు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అ వాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీ ఎం పర్యటన విజయవవంతం కావడంతో పో లీసులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
పర్యటన ఆలస్యం
షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి 2:30 గంటలకు మహబూబ్‌నగర్‌కు రావాల్సి ఉండ గా, 4:15 గంటలకు ఎంవీఎస్ కళాశాల మైదా నం వద్దకు చేరుకున్నారు. అక్కడ నగరంలో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి కల్పన, ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 4:19 నిమిషాలకు వేదికపైకి చేరుకున్నారు. సాయంత్రం 4:55 గంటలకు ప్రసంగం ప్రారంభించి, 5:32 గంటలకు ముగించారు.
సీఎం ప్రసంగానికి సభికుల నుంచి మంచి స్పందన
సీఎం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తున్నపుడు, విపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బీఆర్‌ఎస్ హయాంలో ఇచ్చే బతుకమ్మ చీరలను జొన్నచేలకు పిట్టలు రాకుండా కట్టుకునేవారని చెప్పినప్పుడు కేరింతలతో చప్పట్లు కొట్టారు. 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, ఉచిత బస్సు గురించి చెబుతున్నపుడు మంచి స్పందన లభించింది. ఇదివరకు వాళ్లు ఇచ్చిన దొడ్డు బియ్యం పశువులకు దాణాగా వాడేవారని, లేదంటే మా అక్కోళ్లు అక్కడే రూ.10-11కు విక్రయించి వచ్చే వారని చెప్పినపుడు అనూహ్య స్పందన వచ్చింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను శుక్రాచార్యుడు, మారీచుడు, సుబాహులుతో పోలుఉస్తూ విమర్శలు చేసినప్పుడు కూడా కేరింతలు, చప్పట్లతో జనం స్వాగతించారు.