8న జిల్లా కేంద్రంలో సీఎం కప్ ర్యాలీ
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:19 PM
గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ చాంపియన్‌లుగా తీర్చిదిద్దడామే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎంకప్-2026 నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8న మహబూబ్‌నగర్ స్టేడియం నుంచి మెట్టుగడ్డ వరకు ఉదయం 8:30 గంటలకు ట్రార్చ్ ర్యాలీ నిర్వహిస్తామని డీవైఎ్‌సవో శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
9న జడ్చర్ల, దేవరకద్రలలో
పాల్గొననున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ క్రీడాకారులను ప్రపంచ చాంపియన్‌లుగా తీర్చిదిద్దడామే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎంకప్-2026 నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ నెల 8న మహబూబ్‌నగర్ స్టేడియం నుంచి మెట్టుగడ్డ వరకు ఉదయం 8:30 గంటలకు ట్రార్చ్ ర్యాలీ నిర్వహిస్తామని డీవైఎ్‌సవో శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9న ఉదయం 9 గంటలకు జడ్చర్ల, మధ్యాహ్నం 2 గంటలకు దేవరకద్రలో ర్యాలీ ఉంటుందని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజవర్గ ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్, అధికారులు ర్యాలీలో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, వ్యాయమ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు, విద్యార్థులు ప్రతీ ఒక్కరూ పాల్గొని క్రీడాజ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీవైఎ్‌సవో శ్రీనివాస్ కోరారు.