ఊడిపడిన సీలింగ్ పెచ్చులు
ABN , Publish Date - Sep 29 , 2026 | 12:09 AM
వనపర్తి జిల్లా కేంద్రంలోని రో డ్లు, భవనాలశాఖ సర్కిల్ కార్యాలయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది.
- ఆర్ అండ్ బీ కార్యాలయంలో చోటు చేసుకున్న ఘటన
- ఆ సమయానికి ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం
వనపర్తి/వనపర్తిటౌన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వనపర్తి జిల్లా కేంద్రంలోని రో డ్లు, భవనాలశాఖ సర్కిల్ కార్యాలయంలో సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఉద యం 11గంటల సమయంలో కార్యాలయం లోని ఓ ముఖ్యమైన గదిలో ఉన్న పీవోపీ సీ లింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. భారీ శబ్దం తో సీలింగ్ ముక్కలు ఇనుప ఫ్రేమ్‌లు నేలపై పడటంతో గది మొత్తం శిథిలావస్థతో నిండి పోయింది. ప్రమాదం జరిగిన సమయంలో గదిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం త ప్పింది. సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలి స్తే భవనం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో స్పష్లమవుతుంది. పైకప్పు నుంచి ఊ డి పడిన పీవోపీ ముక్కలు, ఇనుప ఫ్రేమ్ లు గదిలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ సీలింగ్ బలహీనం గా కన్పిస్తుండటంతో ఎప్పుడు ఏ భాగం కూ లుతుందోనని సిబ్బంది భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ కూలిన ఘటన నేపథ్యం లో ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని ఉద్యోగులు కోరు తున్నారు.
- ఈ విషయంపై వనపర్తి ఆర్ అండ్ బీ శాఖ ఎస్‌ఈ విఠలయ్యను వివరణ కోరగా.... సోమవారం ఉదయం దాదాపు 11 గంటల సమయంలో సర్కిల్ ఆఫీస్‌లోని తన (ఎస్సీ) చాంబర్‌లో తాను కూర్చునే ప్రదేశంలో ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయి. ఆ సమయంలో తాను, ఇతర సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పిందన్నారు. భవనం పాతది కావడంతో సీలింగ్‌పైన ఉండే చెత్తు కాంక్రీట్ ఊడి సీలింగ్‌పై పడటంతో పైకప్పు పెచ్చు లూడిందని తెలిపారు. సమాచారాన్ని ఉన్నతాధికారులకు వివరించడం జరిగిందని, ఎస్టిమేట్ ప్రకారం వెంటనే సీలింగ్ మరమ్మతులు చేస్తామని ఆయన తెలిపారు.