ఛత్రపతి శివాజీ నేటి యువతకు స్ఫూర్తి
ABN , Publish Date - Sep 27 , 2026 | 11:59 PM
ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలకు స్వరాజ్య స్థాపనకు, ధర్మానికి ప్రతీ క అని... ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ డీకే అరు ణ అన్నారు.
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
మహబూబ్‌నగర్ రూరల్, సెప్టెంబరు 27 (ఆంఽధ్రజ్యోతి): ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలకు స్వరాజ్య స్థాపనకు, ధర్మానికి ప్రతీ క అని... ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ డీకే అరు ణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మాచాన్‌పల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ ప్రతీ మాతృమూర్తిని తల్లితో సమానంగా చూసిన గొప్ప వ్యక్తి శివాజీ అని తెలిపారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శివాజీ కేవలం ప్రాంతానికే పరిమితం కాకుండా దేశ ప్ర జలందరికీ హృదయాల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అంబాత్రక్షేత్రం ఆదిత్యపరాశ్రీ స్వామి, సర్పం చు వెంకటయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, విగ్రహదాత శ్రీ రాంరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్వర్‌రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఛత్రపతి శివాజీ మహా రాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన కమిటీ అధ్యక్షుడు గంజి రాజు ముదిరాజ్, మాజీ సర్పంచు వెంకటేశ్వర్ రెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.