Share News

మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:15 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండ లంలోని ఊర్కొండపేట అభయాంజనే య స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివా రం ముగిశాయి.

 మార్మోగిన హనుమాన్‌ నామస్మరణ
స్వామి వారికి చక్రతీర్థ స్నానం చేయిస్తున్న అర్చకులు, నాయకులు

- ముగిసిన అభయాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు

- చివరి రోజు పోటెత్తిన భక్తులు

ఊర్కొండ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండ లంలోని ఊర్కొండపేట అభయాంజనే య స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివా రం ముగిశాయి. ఈ సందర్భంగా ఆల యానికి భారీగా భక్తులు తరలి రావడం తో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. జైశ్రీరాం, జైహనుమాన్‌ నామస్మరణతో ఆ లయ పరిసరాలు మారుమోగాయి. వా రం రోజుల పాటు కొనసాగిన బ్రహ్మోత్సవా ల (జాతర)కు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొ క్కులు చెల్లించుకున్నారు. బ్రహ్మోత్సవాల చి వరి రోజు స్వామి వారి దర్శనం కోసం భక్తు లు క్యూలైన్‌లో గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఉదయం స్వామి వారికి భక్తి శ్ర ద్ధలతో అర్చకులు ప్రత్యేక పూజలు, చక్రతీర్థ స్నానం అభిషేకం నిర్వ హించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహం ఆలయం నుంచి ఊర్కొండపేట బ్ర హ్మశ్రీ దివంగత. చిరివెళ్లి కృష్ణమూర్తి శర్మ అర్చకుల గృహమునకు మంగళహార తులు, వాయిద్యాలతో చేర టంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. సర్పంచ్‌ రషీద్‌, రమేష్‌ నాయక్‌, నాయకులు సత్య నారాయణరెడ్డి, అర్చకులు దత్తాత్రేయశర్మ, మహేష్‌ శర్మ, శ్రీనివాసశర్మ, ప్రవీణ్‌ శర్మ అలయం కార్యనిర్వహణాధికారి సత్య చంద్రారెడ్డి, సిబ్బంది మారుతిరావు, వరలక్ష్మీ, శ్రీశైలం, అభిరామ్‌ మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:15 PM