జోగుళాంబ జోన్ డీఐజీగా చందన దీప్తికి పూర్తి అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Nov 12 , 2026 | 11:55 PM
జో గులాంబ జోన్ డీఐజీగా చందన దీప్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మహబూబ్‌నగర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జోగులాంబ జోన్ డీఐజీగా చందన దీప్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆమె ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌లో జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు. ఇదివరకు డీఐజీగా పనిచేసిన ఎల్‌ఎస్ చౌహాన్‌పై పలు అవినీతి ఆరోపణలు రావడంతో నాలుగు నెలల క్రితం ఆయనను బదిలీ చేశారు. అప్పటి నుంచి ఐజీ షాహనవాజ్ ఖాసీంకు జోగులాంబ డీఐజీ ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఐపీఎస్ బదిలీల్లో భాగంగా చందన దీప్తికి పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. రెగ్యులర్ డీఐజీ ఇప్పట్లో ఇచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. త్వరలోనే సీనీయర్ ఎస్పీలకు డీఐజీలుగా పదోన్నతులు రానున్నాయి. అప్పుడే రెగ్యులర్ డీఐజీని నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.