చాంపియన్ ఢిల్లీ
ABN , Publish Date - May 01 , 2026 | 11:33 PM
ఎస్‌జీఎఫ్ అండర్-17 జాతీ యస్థాయి బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్ ఢిల్లీ జట్టు నిలిచింది.
- రన్నర్‌గా తమిళనాడు
- మూడోస్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్
- ముగిసిన జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎస్‌జీఎఫ్ అండర్-17 జాతీ యస్థాయి బాలుర క్రికెట్ టోర్నీ చాంపియన్ ఢిల్లీ జట్టు నిలిచింది. శుక్రవారం జడ్చర్ల మినీ స్టేడియంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తమిళనాడుపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొ దట బ్యాటింగ్ చేసిన తమిళనాడు జట్టు నిర్ణీ త 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరు గులు చేసింది. జట్టులో తమిళసెల్వమ్ 46 ప రుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఆకాష్ 3 వి కెట్లు తీసి రాణించాడు. అనంతరం బ్యా టింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 19.1 ఓవర్లలలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి విజేతగా నిలువగా, తమిళనాడు రన్నర్‌గా నిలిచింది. జట్టులో యువరాజ్‌శర్మ అర్ధసెంచరీ(59) చే సి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించా డు. తమిళనాడు బౌలర్లలో రిశాంత్ 2 వికెట్లు తీశాడు. ఉత్తరాఖండ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది.
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉంటుం దని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ అన్నారు. జడ్చర్ల మినీ స్టేడియంలో శుక్రవా రం ఎస్‌జీఎఫ్ అండర్-17 జాతీయస్థాయి బాలుర క్రికెట్ పోటీల ముగింపు కార్యక్ర మానికి ఆయన హాజరై విజేతలకు బహుమ తులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ జడ్చర్ల పట్టణంలో జాతీ యస్థాయి పోటీలను విజయవంతం నిర్వ హించడం పట్ల నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్ల మునిసిపల్ చైర్‌ప ర్సన్ కోనేటి పుప్పలత, వైస్ చైర్‌పర్సన్ సారిక, జడ్చర్ల ఎంఈవో మంజులాదేవి, ఎస్ జీఎఫ్ సెక్రటరీ శారదాబాయి, టోర్నీ కార్యని ర్వహక కార్యదర్శి మొయిన్, పీడీ,పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దూమర్ల ని రంజన్, పీడీలు కృష్ణ, శంకర్, సోమ్లా, ఉమా రాణి, సుగుణ తదితరులు పాల్గొన్నారు.