Share News

సొంత నిధులతో బోర్లు వేయిస్తున్న చైర్‌పర్సన్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:34 PM

ము నిసిపాలిటీలో బీజేపీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా కొండా శ్వేత బాధ్యతలు స్వీకరించి ఐదు నెలల కాలంలోనే తాగునీటి ఎద్దడి నియంత్రణకు చ ర్యలు చేపట్టారు.

సొంత నిధులతో బోర్లు వేయిస్తున్న చైర్‌పర్సన్‌
రెండో వార్డులో బోరును ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ కొండా శ్వేత

- తాగునీటి ఎద్దడి తీర్చేందుకు మూడు వార్డుల్లో తక్షణ చర్యలు

- పేట రెండో వార్డులో బోరును ప్రారంభించిన కొండా శ్వేత

నారాయణపేట, జూలె ౖ5 (ఆంధ్రజ్యోతి): ము నిసిపాలిటీలో బీజేపీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా కొండా శ్వేత బాధ్యతలు స్వీకరించి ఐదు నెలల కాలంలోనే తాగునీటి ఎద్దడి నియంత్రణకు చ ర్యలు చేపట్టారు. సొంత నిధులు వెచ్చించి మూ డు వార్డులలో బోర్లు డ్రిల్లింగ్‌ చేయించి ఆయా వార్డుల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలకు శ్రీకారం చుట్టారు. మునిసిపాలిటీ పరి ధిలోని రెండో వార్డు బ్రహ్మణవాడిలో చైర్‌పర్సన్‌ స్వంత నిధులతో వేసిన బోరును ఆదివారం వా ర్డు కౌన్సిలర్‌ సౌజన్యతో కలిసి పూజలు చేసి ప్రా రంభించారు. దాంతో చైర్‌పర్సన్‌ను ఆ ప్రాంత వాసులు అభినందించారు. ము నిసిపాలిటీ పరిధిలో రెండు రో జులకో మారు మిషన్‌ భగీరథ నీరు సరఫరా అవుతున్నది. దాంతో రోజు విడిచి రోజు గం ట పాటు తాగునీరు వస్తుండ డంతో పలు ప్రాంతాల్లో తాగు నీటి ఎద్దడి అధికంగా ఉంది. నీటి ఎద్దడిని కౌన్సిలర్లు చైర్‌ పర్సన్‌ దృష్టికి తీసుకువస్తుండ టంతో ఆమె సొంత నిధులతో బోర్లను డ్రిల్లింగ్‌ చేయిస్తున్నారు. అయితే, మో టార్లు, స్టాటర్స్‌, పైపుల ఏర్పాటుకు మాత్రం ము నిపాలిటీ నిధులను వినియోగిస్తున్నారు. బోరు డ్రిల్లింగ్‌ నిధులను వినియోగించేందుకు ప్రభు త్వ పరంగా ఎలాంటి అనుమతులు లేక పోవ డంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు అన్నీ తానై స్వంత ఖర్చుతో చర్యలు తీసుకుంటున్నారు. తాను ప్రా తినిధ్యం వహించిన నాలుగవ వార్డు గాంధీనగర్‌ లో కొత్తగా బోర్‌ డ్రిల్లింగ్‌ చేయడంతో నీరు స మృద్ధిగా పడడంతో మోటార్‌ బిగించి నీటి సరఫ రాకు చర్యలు తీసుకున్నారు. 19వ వార్డులో కౌన్సి లర్‌ నాగమ్మ నీటి ఎద్దడి విషయమై చైర్‌పర్స న్‌ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి హజీఖాన్‌పేట్‌లో బోర్‌డ్రిల్లింగ్‌ చేసి మోటార్‌ బిగించి నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jul 05 , 2026 | 11:34 PM