అక్రమ రిజిస్ర్టేషన్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Apr 02 , 2026 | 11:15 PM
గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కా ర్యాలయంలో చిరునామా ఒకరిది.. ఫొటో మరొకరిది పెట్టి అక్రమ రి జిస్ర్టేషన్ చేసిన విషయంపై బాధితుడు కృష్ణ బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే.
- ఆర్టీవో కార్యాలయంలో పోలీసుల విచారణ
గద్వాల, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): గద్వాల జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కా ర్యాలయంలో చిరునామా ఒకరిది.. ఫొటో మరొకరిది పెట్టి అక్రమ రి జిస్ర్టేషన్ చేసిన విషయంపై బాధితుడు కృష్ణ బుధవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం విధితమే. కేసు నమోదు చేసిన రూరల్ ఎస్‌ఐ శ్రీకాంత్ విచారణ ప్రారంభించారు. షోరూమ్ మేనేజర్ ఏ వీ నర్సింహ, ఆర్టీఓ కార్యాలయంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే విషయంపై గురువారం ఇన్‌చార్జి ఆర్టీవో వెంకటేశ్వర్‌రావుతో ఎస్‌ఐ విచారిం చారు. రిజిస్ర్టేషన్ చేసిన రోజు విధుల్లో ఎవరెవరు ఉన్నారు? ఫైల్ ఎవరెవరి వద్దకు వెళ్లింది.. ఇందులో ఎవరి పాత్ర ఉందనే విషయంపై ఆరా తీ శారు. మెమోలు అందుకున్న ఉద్యోగులు ఎవరు? వారి పాత్ర ఎంత అనే విషయంపై వివరాలు తెలుసుకున్నారు. బాధితుడు వెలుగులోకి తేవడంతో బహిర్గతమైందని, కానివి ఇంకా ఏమైన ఉన్నాయా అనే విషయాలపై పోలీసులతో పాటు ఆర్టీవో అంతర్గత విచారణ ప్రారంభించారు. ఆర్టీ వో ఏజెంట్ల ద్వారా వసూళ్లు చేస్తు అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని వాహనదారులు అంటున్నారు. ఏజెంట్లపై నిఘాపెట్టి అక్రమ కార్యకలాపాలు జరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.