ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదుతో కేసు నమోదు
ABN , Publish Date - Jul 22 , 2026 | 11:47 PM
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు గ్రామం వద్ద కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారిపై జరిగిన ఆర్టీసీ బస్సు, కారు ప్రమాదం తెలిసిందే.
- గుంతకోడూరులో బస్సు, కారు ప్రమాదం
- శరత్‌గౌడ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగింత
- మృతుడికి మూడు నెలల క్రితమే వివాహం
తాడూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని గుంతకోడూరు గ్రామం వద్ద కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారిపై జరిగిన ఆర్టీసీ బస్సు, కారు ప్రమాదం తెలిసిందే. ఈ ఘటన కు సంబంధించి కల్వకుర్తి డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ లిం గమయ్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి స్పాట్‌లోనే మృతి చెందిన శరత్‌గౌడ్(58)ది రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల పరిధిలోని కోనాపూ ర్ గ్రామానికి చెందిన బాలమణి కుమారుడు. మూడు నెలల క్రితమే నాగ ర్‌కర్నూల్ జిల్లా కేంద్రానికి కావ్య అలియాస్ శాలినితో వివాహం జరిగింది. ఈ క్రమంలో అత్తారిల్లు అయిన నాగర్‌కర్నూల్ వస్తుండగా స్కార్పియో కా రుకు సంబంధించిన టైర్లు పేలడంతో ముందుగా ఉన్న మోటారు సైకిల్ ను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నట్లు ఎస్‌ఐ తె లిపారు. ఈ ఘటనలో జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తైన అనంత రం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. మొత్తంగా మృ తుడి అన్న, తండ్రి ఇప్పటికే మృతి చెందగా, ప్రస్తుతం రెండవ సంతా నమైన శరత్ సైతం మృతి చెందడంతో ఈ మధ్య కాలంలోనే పెళ్లి కావ డంతో ఇరు కుటుంబాల్లోని కుటుంబ సభ్యుల పరిస్థితి హృదయ విదా రకంగా మారింది.