వయోవృద్ధుల సంరక్షణ, చట్టాలపై అవగాహన
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:25 PM
అంతర్జాతీయ వ యోవృద్ధుల దినోత్సవం సం దర్భంగా జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్తంగా తల్లి దండ్రుల, వయోవృద్ధుల పో షణ, నిర్వహణ, సంరక్షణ, సంక్షేమ చట్టాలపై అవగా హన సదస్సు నిర్వహించారు.
నారాయణపేట న్యూటౌన్, సెప్టెంబరు 29 (ఆంధ్ర జ్యోతి): అంతర్జాతీయ వ యోవృద్ధుల దినోత్సవం సం దర్భంగా జిల్లా న్యాయ సేవా ధికార సంస్థ, జిల్లా సంక్షేమ శాఖలు సంయుక్తంగా తల్లి దండ్రుల, వయోవృద్ధుల పో షణ, నిర్వహణ, సంరక్షణ, సంక్షేమ చట్టాలపై అవగా హన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని ప్రణయ్ డేకేర్ సెంటర్‌లో మంగళవారం ని ర్వహించిన కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్ మాట్లాడారు. వ యోవృద్ధులు తమకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావడం తో పాటు, అవసరమైన సందర్భాల్లో ఉచిత న్యా య సహాయాన్ని వినియోగించుకోవాలని సూ చించారు. వయోవృద్ధులకు ఆరోగ్యకరమైన జీవ నాన్ని అందించేందుకు ప్రభుత్వ శాఖలు, సం బంధిత సంస్థలు సమన్వయంతో పనిచేస్తున్నా యన్నారు. సదస్సులో ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సాయి, డా.తిరుపతయ్య, జూనియర్ న్యాయ వాది క్రాంతికుమార్, సిబ్బంది, వయోవృద్ధులు పాల్గొన్నారు.