అంబ్రెల్లా స్పెల్లింగ్ కూడా రాదా?
ABN , Publish Date - Jul 30 , 2026 | 11:28 PM
విద్యార్థులకు అంబ్రెల్లా స్పెలింగ్ కూడా రాదా? అంటూ మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఉపాధ్యాయులపై అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆగ్రహం
- అరగంట పాటు విద్యార్థులకు ప్రత్యేక క్లాస్
- మిడ్జిల్ జడ్‌పీహెచ్‌ఎస్ ఆకస్మిక తనిఖీ
మిడ్జిల్, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులకు అంబ్రెల్లా స్పెలింగ్ కూడా రాదా? అంటూ మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఉపాధ్యాయుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్జిల్ మం డల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికం గా తనిఖీ చేశారు. 10వ తరగతి విద్యార్థుల ప్రమాణాలను పరీక్షించారు. వారు అంబ్రెల్లా స్పెలింగ్ కూడా చెప్పలేకపోవడంతో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిని పిలిపించి నిలదీశారు. ఆ తర్వాత విద్యార్థులకు అరగంట పాటు ప్రత్యే క తరగతి నిర్వహించారు. స్పెల్లింగ్ తప్పులు లేకుండా రాయడం, పదాలను చదవడంపై అవగాహన కల్పించారు. తాను మళ్లీ వస్తా నని, విద్యార్థులతో కలిసి స్లిప్ టెస్ట్ కూడా రాస్తానని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వి నియోగం చేసుకుని శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని చెప్పారు. అనంతరం వంటశాలను పరిశీలించిన ఆయ న, కుళ్లిపోయిన కూరగాయలను చూసి సి బ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని వండి పెడితే విద్యార్థుల ఆరోగ్యం ఏమవు తుందని ప్రశ్నించారు. పాఠశాల ఆవరణలో అపరిశుభ్రత నెలకొని ఉండటంపైనా అసం తృప్తి వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న పంచా యతీ కార్యదర్శి సాయన్న, ఏపీవో హైమా వతిలను ప్రశ్నించారు. పారిశుధ్యంపై ప్రత్యే క దృష్టి సారించాలని ఆదేశించారు. అయన వెంట సర్పంచ్ ఎడ్ల శంకర్, ఎంపీడీవో లక్ష్మణ్‌రాథోడ్, ఎంపీవో రాజశేఖర్‌రెడ్డి, ఏఈ మహేశ్, ఉపాధ్యాయులు ఉన్నారు.