బస్సులు నిలపక.. ఆటో తప్పక...
ABN , Publish Date - Jul 19 , 2026 | 11:17 PM
మానవపాడు మం డలం, చంద్రశేఖర్‌నగర్, శ్రీనగర్, కొ ర్విపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులు బ స్సులు నిలపకపోవడం, సమయా నికి రాకపోవడంతో నెలవారీగా చా ర్జీలు ఇచ్చేలా ఆటోలను ఏర్పాటు చేసుకుని నిత్యం బొంకూరు పాఠశా లకు వచ్చి వెళ్తున్నారు.
ఉండవల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలంలోని బొంకూరు ఉన్నత పాఠశాలకు మంచి పేరు ఉంది. రెండేళ్లుగా ఉత్తీర్ణత శాతం కొనసా గుతుండటంతో మానవపాడు మం డలం, చంద్రశేఖర్‌నగర్, శ్రీనగర్, కొ ర్విపాడు తదితర గ్రామాల నుంచి విద్యార్థులు అధికసంఖ్యలో వస్తున్నా రు. పైవాటిలో రెండు గ్రామాలు అయిజ వెళ్లే దారిలో ఉన్న గద్వాల డిపో బస్సులు తిరుగుతున్నా.. బ స్సులు నిలపకపోవడం, సమయా నికి రాకపోవడంతో నెలవారీగా చా ర్జీలు ఇచ్చేలా ఆటోలను ఏర్పాటు చేసుకుని నిత్యం బొంకూరు పాఠశా లకు వచ్చి వెళ్తున్నారు. బస్సుల్లేవన్న కారణంతో పిల్లలను బడిమాన్పించ లేం కదా అని కొర్విపాడు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. తమ గ్రామానికి తెలంగాణ ఏర్ప డినప్పటి నుంచి బస్సులు రావడంలేదని, అంత కుముందు కర్నూలు డిపో బస్సులు విరివిగా తిరిగేవని తెలిపారు. గత్యంతరం లేక ఆటోలలో పిల్లలను బడికి పంపుతున్నామని చెప్పారు.