Share News

మంటగలుస్తున్న మానవత్వం

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:17 PM

మానవత్వం మంట కలుస్తోంది. కన్నవారే కాల యములుగా మారుతున్నారు. కన్న పేగును కడతేరుస్తున్నారు. నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి.

మంటగలుస్తున్న మానవత్వం
చిన్నారులను పడేసిన కోయిల్‌సాగర్‌ డిస్ర్టిబ్యూటరీ కాల్వ ఇదే..

పేగుబంధం మరుస్తున్న తల్లిదండ్రులు

నాడు ఆడ శిశువును ముళ్ల పొదల్లో వదిలేసిన తల్లి

తొమ్మిదేళ్ల బాలికపై తండ్రి అఘాయిత్యం

నేడు కుమారుడు, కుమార్తెలను ఉరేసి చంపిన తండ్రి

ఆపై తానూ ఆత్మహత్యాయత్నం

నారాయణపేట జిల్లాలో కలకలం రేపుతున్న ఘటనలు

నారాయణపేట, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): మానవత్వం మంట కలుస్తోంది. కన్నవారే కాల యములుగా మారుతున్నారు. కన్న పేగును కడతేరుస్తున్నారు. నారాయణపేట జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలు అందుకు అద్దం పడుతున్నాయి. గత ఏడాది జూలై 27న జిల్లాలోని మరికల్‌ మండలానికి చెందిన ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల కూతురిపై కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటన మరువక ముందే తాజాగా మంగళవారం అదే మండలం తీలేరు గ్రామంలో తండ్రి శివరాములు కసాయిగా మారాడు. కూతురు రిత్విక(8), కుమారుడు చైతన్య(5)లను తెల్లవారుజామున వ్యసాయ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఊరేసి హత్య చేశాడు. అనంతరం దగ్గరలో ఉన్న కోయిల్‌సాగర్‌ కాల్వలో పడేశాడు. తర్వాత అతనూ ఆత్మహత్య చేసుకోవాలని విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌ దగ్గరికి వెళ్లి వైర్లు పట్టుకున్నాడు. విద్యుదాఘాతానికి గురైనా ప్రాణాలు పోకపోవడంతో పొలం వద్ద క్రిమి సంహారక మందు తాగాడు. బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. దాంతో అతని పరిస్థితి విషమంగా మా రింది. విషయం తెలిసిన గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. పోలీసులు వచ్చి కాలువలోంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. పరిస్థితి విషమంగా ఉన్న శివరాములును మహబుబ్‌నగర్‌ అసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. విబేధాలతో భార్య సుజాత కాపురానికి రాకపోవడంతో ఏడాదిన్నర క్రితం విడాకులు తీసుకున్నారు. దాంతో మనస్తాపానికి గురైన శివరాములు తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారని ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తూన్నారు.

తండ్రి ఫిర్యాదుతో..

గత ఏడాది నవంబరు 30న ధన్వాడకు చెందిన భారతి అప్పక్‌పల్లి జిల్లా ఆసుపత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చించింది. కానీ బిడ్డ చనిపోయిందని భర్త నర్సింములుకు ఫోన్‌ చేసి చెప్పింది. అయితే తల్లీ బిడ్డలు ఆసుపత్రి నుంచి డిచార్జి అయినట్లు రికార్డులు ఉండటంతో అనుమానం వచ్చిన భర్త భార్య, అత్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే జిల్లా ఆసుపత్రి సమీపంలో అప్పక్‌పల్లి వద్ద ముళ్లపొదల్లో పసికందు ఉండటాన్ని చూసిన గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. కొన ఊపిరితో ఉన్న పసికందుకు జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందించారు. కానీ పరిస్థితి విషమించడంతో సాయంత్రం మృతి చెందింది.

Updated Date - Jan 06 , 2026 | 11:17 PM