Share News

వ్యక్తి దారుణ హత్య

ABN , Publish Date - Jul 26 , 2026 | 11:27 PM

ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

 వ్యక్తి దారుణ హత్య

గోపాల్‌పేట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని బుద్ధారం గ్రామ పరిధిలో ఉన్న లక్ష్మితండాకు చెందిన ముడావత్‌ మేఘ్యా నాయక్‌ (55) తండా లో తనకు ఉన్న 3 ఎకరాల పొలంలో వరి సాగు చేస్తున్నాడు. మేఘ్యా భార్య నాను 9 నెలల కిందట అనారోగ్యంతో మృతి చెందింది. మేఘ్యా దంపతులకు ఇద్దరు కొడుకులు శ్రీను, కిషన్‌. వీరు హైదరబాద్‌లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. మేఘ్యా తండాలో తన నివాసంలో ఒక్కడే ఉంటున్నాడు. రోజూలాగానే రాత్రి భోజనం పూర్తి చేసుకొని పక్కింటి వారితో మాట్లాడి రాత్రి 10 గంటల సమయంలో నిద్రపోయాడు. ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఆదివారం సాయంత్రం 4 గంటలకు మేఘ్యా వద్ద బీడీ కోసమని వచ్చి మూసుకుని ఉన్న ఇంటి తలుపు తెరిచి చూడగా, మేఘ్యా శవమై కనిపించాడు. అతడ్ని ఎవరో మెడపై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. రక్తపు మడుగులో ఉన్న మేఘ్యాను చూసి భయంతో చుట్టు పక్కల వారికి సర్పంచ్‌ పీర్యకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్లూస్‌ టీంను పిలిపించి వివరాలు సేకరించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ గిరిబాబు, సీఐ రత్నం పరిశీలించారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆసుసత్రికి తరలించామన్నారు. మేఘ్యా హత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ శశిధర్‌ తెలిపారు.

Updated Date - Jul 26 , 2026 | 11:27 PM