Share News

పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:18 PM

మక్తల్‌ పట్టణానికి అతి సమీపంలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు వెలిసి పర్యావరణ కాలుష్యంతో పాటు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా యి.

పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు
గొల్లపల్లి శివారులోని ఇటుక బట్టీ

- పది కిలోమీటర్ల దూరానికి తరలించాలని స్థానికుల వినతి

- అస్తవ్యస్తంగా మారిన కాట్రవల్లి రోడ్డు

మక్తల్‌ రూరల్‌, నవంబరు 22 (ఆంధ్ర జ్యోతి): మక్తల్‌ పట్టణానికి అతి సమీపంలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా ఇటుక బట్టీలు వెలిసి పర్యావరణ కాలుష్యంతో పాటు స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నా యి. ముఖ్యంగా కాట్రవల్లి రోడ్డులో అనుమ తులు లేకుండా వెలిసిన దాదాపు 10 నుంచి 20 వరకు ఇటుక బట్టీలు కాలుష్యాన్ని వెదజల్లుతుం డగా కాట్రవల్లి రహదారిలో వెళ్లే వాహనదారుల కు నరకయాతన చూపిస్తున్నాయి. స్థానికులు ఎ న్నోసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. కా ట్రవల్లి రహదారి వెంట వెళ్లే వాహనదారులు ప్ర మాదాల బారిన పడి తీవ్ర గాయాలపాలై ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు. బట్టీల కారణం గా దుమ్ముధూళితో పాటు వేడి, వాతావరణ కా లుష్యంతో తీవ్ర శ్వాస కోశకు ఇబ్బందుల పాలై నరకయాతన అనుభవిస్తున్నారని సమీప గ్రా మాల ప్రజలు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు అతి సమీపంలో బట్టీలు

ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు అతి సమీపంలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వీటి వల్ల భవిష్యత్తు లో వేలాది మంది విద్యార్థులకు తీవ్ర శ్వాసకోశ సమస్యలతో పాటు, ఇతరత్రా ఇబ్బందులు తలె త్తే అవకాశం ఉందని స్థానికులు పేర్కొన్నారు. కాట్రవల్లి రోడ్డుతో పాటు కాచువార్‌, గొల్లపల్లి, లింగంపల్లి, మాగనూరు జాతీయ రహదారి వైపు మొత్తంగా మక్తల్‌ పట్టణానికి నలువైపులా సుమారు పది కిలోమీటర్ల రేడియస్‌లో ఎలాంటి ఇటుక బట్టీలు ఉండకూడదని, వాటిని వెంటనే తరలించాలని స్థానికులు అధికారులను డిమాం డ్‌ చేస్తున్నారు. ఇటుక బట్టీలను తరలించకపోతే భవిష్యత్తులో ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎ త్తున ఉద్యమానికి శ్రీకారం చుడుతామని వారు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:19 PM