కొందరికే అల్పాహారం
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:05 AM
సర్కార్ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- పాలమూరు జిల్లాలో 805 ప్రభుత్వ పాఠశాలలు
- 77 పాఠశాలల్లోనే అమలవుతున్న పథకం
- మధ్యాహ్నం వరకు ఆకలితోనే విద్యార్థులు
- అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : సర్కార్ బడుల్లో చదువుకుంటు న్న విద్యార్థులందరికీ పౌష్టికాహారం అందించాల ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భా గంగా అల్పాహారం పథకానికి శ్రీకారం చుట్టింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని 17 మండలాల్లో 805 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వాటిల్లో 61,963 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో కేవలం 77 పాఠశాలల్లో చదువుకుం టున్న 9,110 మంది విద్యార్థులకు మాత్రమే అల్పాహారం అందిస్తున్నారు. మిగతా పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఖాళీ కడుపుతోనే పాఠశాలలకు వస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
‘అక్షయపాత్ర’ ఫౌండేషన్ భాగస్వామ్యం
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుం టున్న విద్యార్థుల ఆకలి తీర్చేందుకు అక్షయపా త్ర ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రతీ రోజు ఉదయం అల్పాహారం అందిస్తున్నారు. కానీ, ఈ పథకాన్ని 77 పాఠశాలల్లోనే అమలు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తమకు ఎందుకు అల్పాహారం ఇవ్వడం లేదని మిగతా పాఠశాలల విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు గతంలో మాదిరిగా విద్యార్థులందరికీ రాగి జావ అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కనీసం దసరా సెలవుల తర్వాతైనా అన్ని పాఠశాలల్లో అల్పాహారం పథకం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మధ్యాహ్నం వరకు ఆకలితోనే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువగా పేద విద్యార్థులే చదువుకుంటున్నారు. వారిలో చాలా మంది వి ద్యార్థులు ఇళ్ల వద్ద ఏమీ తినకుండానే బడికి వస్తున్నారు. వారంతా మధ్యాహ్నం 12.15 గంటల వరకు ఆకలితోనే ఉండాల్సి వస్తోంది. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేస్తే విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి ఫలి తాలు కూడా వస్తాయి.
- బైకని బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయడు, తాటికొండ
ఆదేశాలు వస్తే ప్రారంభిస్తాం
అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా జిల్లాలోని 77 పాఠశాలల్లో అల్పాహారం పథకాన్ని అమలు చేస్తున్నాం. దీంతో వి ద్యార్థుల ఆకలి తీరుతోంది. అల్పాహారం రుచిగా ఉండటంతో ఇష్టంగా తింటున్నారు. అన్ని పాఠశాలలో అమలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రా వాల్సి ఉంది. రాగానే ప్రారంభించేందుకు చ ర్యలు తీసుకుంటాం.
- ఐ.విజయకుమారి, డీఈవో, మహబూబ్‌నగర్