సూర్యభగవానుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , Publish Date - Jan 24 , 2026 | 11:17 PM
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూ రు మండలంలోని భలాన్‌పల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీసూర్యనారా యణస్వామి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకు ని మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు.
- మొదటి రోజు ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన విశ్వశాంతి మహాయజ్ఞం
- స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు
తాడూరు, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా తాడూ రు మండలంలోని భలాన్‌పల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీసూర్యనారా యణస్వామి దేవాలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకు ని మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందు లో భాగంగా మొదటిరోజు శనివారం సూర్యనారాయణస్వామి ఉషాదే వి, ఛాయాదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుతో ఆలయా నికి చేరుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సూర్య ఆదిత్య పారాయణం, భగవద్గీత పఠనంతో పాటు అశేష భక్త జనవా హిని మధ్య విశ్వశాంతి మహయజ్ఞానాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వ హించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయాన్ని వివిధ గ్రామాలకు చెందిన భక్తులతో పాటు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్, సీఐ అశోక్‌రెడ్డి, ఎ స్‌ఐ గురుస్వాములు దర్శించుకున్నారు.