వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Nov 10 , 2026 | 11:32 PM
మహబూబ్‌నగర్ జిల్లా చి న్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
- కనుల పండువగా కురుమూర్తి స్వామి కల్యాణోత్సవం
చిన్నచింతకుంట, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్ జిల్లా చి న్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలోని కురుమూర్తి వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ధ్వజారోహనం, దేవతాహ్వనము, భేరీపూజలతో ముఖ్యమైన స్వామి వారి కల్యాణోత్సవం ఎంతో కమనీయంగా నిర్వహించారు. కాగా, వివిధ ప్రాం తాల నుంచి భక్తులు తరలివచ్చి, కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజు, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
అఖండదీపం వెలిగించిన కొత్తకోట సిద్ధార్థరెడ్డి..
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్‌పర్సన్ కొత్తకోట సీతాదయాకర్‌రెడ్డి తనయుడు కొత్తకోట సిద్ధార్థరెడ్డి కురుమూర్తి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు, కార్తీక మాసం కానుండటంతో ఆలయంలో సోమవారం అఖండదీపం వెలిగించారు. అర్చకుల వేదమంత్రోచ్ఛారణతో స్వామి వారి ఎదుట దీ పాన్ని వెలిగించారు. గతంలో దివంగత నాయకుడు, మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి వెలిగిస్తుండగా, ఇప్పుడు ఆయన వారసునిగా దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయంలో స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు చిన్న వడ్డెమాన్ గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి వారి ఆలయంలోనూ అఖండ దీపాన్ని సోదరుడు కొత్తకోట కార్తీక్‌రెడ్డితో కలి సి వెలిగించారు.
మయూర వాహనసేవలో ఊరేగిన కురుమూర్తిరాయుడు
కురుమూర్తి స్వామి బ్ర హ్మోత్సవాలు మంగళవారం ఎంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కాగా, రాత్రి స్వామి వారిని మయూర వాహనంలో భక్తులు ఊ రేగించారు. గోవింద నా మంతో ఆలయం మారుమోగింది. ఆలయ చైర్మన్ బత్తుల బాలరాజు, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, పాలకరవ్గం సభ్యులు పాల్గొన్నారు.