నీటి సంపులో పడి బాలుడి మృతి
ABN , Publish Date - Jun 26 , 2026 | 11:08 PM
నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మ హబూబ్‌నగర్ రూరల్ మండలం రాం చంద్రాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం రాంచంద్రాపూర్‌లో ఘటన
మహబూబ్‌నగర్ రూరల్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి) : నీటి సంపులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మ హబూబ్‌నగర్ రూరల్ మండలం రాం చంద్రాపూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జా వాదు రాజు, లక్ష్మిలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు మణికంఠ(3) మణికొండలోని వాగ్దేవి నర్సరీలో ఈ నెలలోనే చేర్చారు. పాఠశాలకు సెలవు ఇవ్వడంతో బాలుడు ఇంటి దగ్గర ఆడుకుంటూ సంపులో పడ్డాడు. తల్లిదండ్రు లు, కుటుంబ సభ్యులు గ్రామంలో అం తా తిరిగినా కనిపించ లేదు. ఇంటి ముందున్న నీటి సొంపు లో కట్టెతో కదిలించగా, శవమై తేలాడు. దాంతో తల్లిదండ్రులు బోరున విలపించారు.