Share News

చెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం

ABN , Publish Date - Feb 24 , 2026 | 11:28 PM

జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ఊరచెరువులో ఈతకు వెళ్లి గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహలు మంగళవారం లభ్యమయ్యాయి.

చెరువులో గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
చెరువులోంచి మృతదేహాలను బయటికి తీస్తున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది

జడ్చర్ల, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామ సమీపంలోని ఊరచెరువులో ఈతకు వెళ్లి గల్లంతయిన ఇద్దరు యువకుల మృతదేహలు మంగళవారం లభ్యమయ్యాయి. జడ్చర్ల సీఐ కమలాకర్‌, జడ్చర్ల ఫైర్‌ స్టేషన్‌ ఆఫీసర్‌ రాజేందర్‌ తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 22న గొల్లపల్లి సమీపంలోని ఊర చెరువులో ఈతకు వెళ్లిన గ్రామానికి చెందిన దుబ్బ నవీన్‌(28), యెడ్ల యాదగిరి(22) గల్లంతయ్యారు. వీరి కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. బోరు మోటర్‌కు వినియోగించే కెమెరాలతో ఆచూకీ కోసం చెరువులో గాలించారు. దాదాపు 25 నుంచి 30 ఫీట్లలోపు ఉన్న గుంత మట్టిలో కూరుకుపోయినట్లుగా గుర్తించారు. పాతాళాన్ని వినియోగించి బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం జడ్చర్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు జడ్చర్ల సీఐ కమలాకర్‌ తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 11:28 PM