Share News

రక్తదానం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత

ABN , Publish Date - Oct 01 , 2026 | 11:11 PM

రక్తదానం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. జాతీ య స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుప త్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురు వారం ఆయన ప్రారంభించి ప్రజలకు రక్తదానం పై అవగాహన కల్పించారు.

 రక్తదానం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత
రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): రక్తదానం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యత అని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. జాతీ య స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని పురస్కరిం చుకుని నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుప త్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని గురు వారం ఆయన ప్రారంభించి ప్రజలకు రక్తదానం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రక్తదానం ఒక మహత్తర సామాజిక బాధ్యత అని అన్నారు. ఇన్‌చార్జి డీ ఎంహెచ్‌వో డాక్టర్‌ రఫీక్‌, డాక్టర్‌ రోహిత్‌, ప్రభు త్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, స్వచ్ఛంద రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.

వయోవృద్దుల సంక్షేమానికి సమష్టి కృషి అవసరం

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పు రస్కరించుకుని జిల్లా మహిళా శిశు వికలాంగు లు సీనియర్‌ సిటిజన్స్‌ శాఖ ఆధ్వర్యంలో గురు వారం కలెక్టరేట్‌ ప్రజావాణి సమావేశ మందిరం లో నిర్వహించారు. అదనపు కలెక్టర్లు బి.చెన్న య్య, దేవ సహాయం, జిల్లా రెవెన్యూ అధికారి పాండుతో కలిసి కలెక్టర్‌ హేమంత కేశ వ్‌ పాటిల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. అనంతరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బాలికలకు తరాల మధ్య అ నుబంధం-ఇంటర్‌ జనరేషన్‌ బాండింగ్‌ అనే అంశంపై ని ర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహు మతులు ప్రదానం చేశారు. అలాగే వివిధ రంగాల్లో సేవలందించిన వయోవృద్ధులను, వృద్ధాశ్రమ నిర్వాహకులను ఘనంగా సన్మానించారు. రాష్ట్ర రిటైర్డు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌, మండల అధ్యక్షుడు సుధాకర్‌ పాల్గొన్నారు.

మూడు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లు, పాస్‌బుక్‌లు రద్దు చేసిన కలెక్టర్‌

కొల్లాపూర్‌ మండలం ముక్కిడిగుండం గ్రా మానికి సంబంధించిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌ల ను ఎస్‌డీఎల్‌సీ కమిటీ సభ్యులు, ఆర్డీవో, డీటీ డబ్ల్యూవో కొల్లాపూర్‌ కమిటీ నివేదిక ఆధారంగా కలెక్టర్‌ గురువారం సమీక్షించారు. ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధిక భూ మిని తమ ఆధీనంలో ఉంచుకున్న కారణాలతో మూడు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ క్లెయిమ్‌లను, పాస్‌బు క్‌లను జిల్లా కమిటీ చైర్మన్‌, కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ రద్దు చేశారు. భూమి హక్కులకు సంబంధించిన రికార్డులు గతంలో జారీ చేసిన ఆర్‌వోఎఫ్‌ఆర్‌ హక్కులతో ఉన్న ఓవర్‌ల్యాప్‌లు, భూమి సాగు స్థితి తదితర అంశాలను పరిశీ లించిన అనంతరం ఎస్‌డీఎల్‌సీ సిఫారసుల మే రకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా గిరిజన సంక్షే మ శాఖ అధికారి కోటజీ తెలిపారు.

Updated Date - Oct 01 , 2026 | 11:11 PM